ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వైఖరితో చాలా మంది బీజేపీ నేతలు ఇబ్బంది పడుతున్నారు అంటూ కొన్ని రోజుల నుంచి ప్రచారం ఉంది. అయితే సోము వీర్రాజు వ్యవహార శైలి కారణంగా ఇప్పుడు తిరుపతి పార్లమెంటు పరిధిలో ఉన్న బీజేపీ నేతలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఒకసారి చూస్తే తిరుపతి పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా సమర్థవంతంగా బీజేపీ నేతలు ప్రచారం చేయలేకపోతున్నారు.
జనసేన పార్టీని పక్కనబెట్టి బీజేపీ పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. కాబట్టి జనసేన పార్టీ నేతలు అందరితో కూడా సమావేశాలు నిర్వహించి వాళ్లలో ఉన్న అసంతృప్తిని తొలగించే ప్రయత్నం బీజేపీ రాష్ట్ర నాయకత్వం చేయాల్సి ఉంటుంది. అలాగే తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉన్న కాపు సామాజికవర్గం నేతలతో పాటు దళిత సామాజిక వర్గాల నేతలతో కూడా ఎక్కువగా చర్చలు జరపాల్సి ఉంటుంది.
ఇతర పార్టీల నుంచి ఎవరైనా నాయకులు వచ్చే అవకాశం ఉంటే వాళ్లను ఆహ్వానించి భవిష్యత్తుపై భరోసా కల్పించాల్సిన అవసరం కూడా ఉంది. అయినా సరే సోము వీర్రాజు గాని బిజెపి నేతలు కానీ ఆ ప్రయత్నాలు ఎక్కడ చేయటం లేదు. కనీసం మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారని భావించిన అది కూడా ఎక్కడా జరగలేదు. దీంతో అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉన్న బిజెపి నాయకులకు అర్థం కాని పరిస్థితి.