ఏపీ తొలి కేబినేట్ లో ఆమోద ముద్ర వేసిన అంశాలు ఇవే.. ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!

-

ఇవాళ ఉదయం 10.30 కు ఏపీ మంత్రి వర్గం అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలో భేటీ అయ్యారు. దాదాపు 6 గంటలు సుదీర్ఘంగా తొలి కేబినేట్ భేటీ జరిగింది. ఈ భేటీలో ఇటీవల మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన 25 మంది మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ఈ భేటీలో రైతులు, ఉద్యోగులకు వరాల జల్లు కురిపించారు. పలు అంశాలపై మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.

ఏపీ కేబినేట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే..

వచ్చే అక్టోబర్ నుంచి రైతు భరోసా అమలు, రైతులకు ప్రతి సంవత్సరం 12,500 పెట్టుబడి సాయం.

రైతులకు వడ్డీ లేని రుణాలు, త్వరలో వైఎస్సార్ పేరుతో రానున్నపథకం

రైతు బీమాకు సంబంధించిన ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించేలా నిర్ణయం, క్లెయిమ్ డబ్బులు రైతుకు చేరేవరకు ప్రభుత్వానిదే బాధ్యత

ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, వచ్చే ఉగాది నాడు రిజిస్ట్రేషన్ పట్టాల పంపిణీ

వైఎస్సార్ ఆసరా కింద వృద్ధాప్య పింఛన్ల పెంపు.. ప్రతి నెల 2,250 రూపాయల పింఛన్

వచ్చే సంవత్సరం జనవరి 26 నుంచి ప్రారంభం కానున్న అమ్మఒడి పథకం.. ప్రతి తల్లికి 15 వేల సాయం

ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి అమలు. పెంచిన ఐఆర్ జులై 2018 నుంచి ఇవ్వాలని నిర్ణయం

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబబద్ధీకరణకు ఏపీ కేబినేట్ ఆమోదం

అంగన్ వాడీల వేతనాలు పెంపు. 11,500 రూపాయలకు పెంపు

ఆశా వర్కర్ల జీతాలు 3 వేల నుంచి 10 వేలకు పెంపు

మున్సిపల్, పారిశుద్ధ్య కార్మికుల జీతం 18 వేలకు పెంపు

పీవోఏ, ఏఆర్పీల జీతం 3 వేల నుంచి 10 వేలకు పెంపు

గిరిజన ప్రాంతాల్లో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు జీతాలు 400 నుంచి 4 వేలకు పెంపు. దీని వల్ల ఏపీలోని ఏడు ఐటీడీఏల పరిధిలో పనిచేస్తున్న 7265
మందికి లబ్ధి

రాష్ట్ర ప్రభుత్వంలో ఏపీఎస్సార్టీసీ విలీనం.. త్వరలో ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సులు

అగ్రిగోల్డ్ బాధితుల కోసం 1150 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున హైకోర్టులో జమ. రూ.20 వేల లోపు డిపాజిట్లు చేసిన వారందరికీ వెంటనే చెల్లించేలా ఏర్పాట్లు

నామినేటెడ్ కమిటీలు రద్దు

పొదుపు సంఘాల మహిళలకు హెల్ప్ చేసే రిసోర్స్ పీపుల్, యానిమేటర్స్ కు 10 వేల వేతనం

రేషన్ బియ్యం ఇంటికే సరఫరా. నాణ్యమైన బియ్యం పంపిణీ. పౌరసరఫరాల శాఖ ద్వారా.. 5, 10, 15 కిలోల బియ్యం సంచులను సెప్టెంబర్ 1 నుంచి డోర్ డెలివరీ

విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజనాన్ని సెంట్రలైజ్ కిచెన్ ద్వారా సరఫరా

104, 108 వాహనాల కేటాయింపు. ఎమర్జెనీ సమయంలో కాల్ వచ్చిన 20 నిమిషాల లోపు వాహనం ఆ ప్రాంతానికి చేరుకునేలా ఏర్పాట్లు

సీపీఎస్ రద్దుపై కమిటీ ఏర్పాటు

ఆరోగ్యశ్రీ సేవలను ఇతర రాష్ట్రాల్లో కూడా ఉపయోగించుకునేలా వెసులుబాటు

రెండు వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి, 3 వేల కోట్లతో మార్కెట్ స్థిరీకరణ నిధి

టీడీపీ హయాంలో ఉన్న ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలన్నీ రద్దు.

త్వరలో కొత్త ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు

పారదర్శకంగా ఇసుక విధానం

అవినీతిని బయటపెడితే అధికారులు, మంత్రులు, ఇతర నాయకులెవరికైనా సన్మానం

Read more RELATED
Recommended to you

Latest news