జూన్ 11 రాశిఫలాలు : ఉత్తరానక్షత్ర పూజ చేస్తే ఈరాశులకు శనిదోష నివారణ!

414

మేషరాశి : విందులు, చెడువార్తా శ్రవణం, ఆకస్మిక ధనలాభం, ఆనందం, పనులు పూర్తి, ఇష్టమైన ఆహారం లభ్యం, అధికశ్రమ.
పరిహారాలుః శివాలయంలో అభిషేకం మంచి ఫలితాన్నిస్తుంది.

వృషభరాశి : దేవాలయ దర్శనం, ఉద్యోగంలో మార్పులు, సేవకుల వల్ల కీర్తి, పనులు పూర్తి, ఆర్థిక లాభం, కుటుంబ సఖ్యత, పనుల్లో జాప్యం
పరిహారాలుః కుజగ్రహం దగ్గర ఎర్రవత్తులతో దీపారాధన చేస్తే మంచి ఫలితం.

మిథునరాశి : సోదరలతో నష్టం, సంతానానికి అనారోగ్య సూచన, పనులు వాయిదా, ప్రయాణాలు కలసిరావు, అనవసర మాటలు.
పరిహారాలుః శివునికి దానిమ్మరసంతో అభిషేకం చేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి.

కర్కాటకరాశి : స్త్రీ పరిచయం, సోదరులు సహాయపడుతారు, అనుకూల ఫలితాలు, కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు, భాగస్వామితో ఆనందం.
పరిహారాలుః ఇష్టదేవతరాధన, నవగ్రహాలకు ప్రదక్షణ చేస్తే చాలు మంచిది.

సింహరాశి : వ్యవహార నష్టం, కొత్త విషయాలు చర్చిస్తారు, భార్య తరపు వారు రాక, ప్రయాణ సూచన, అనవసర విషయాల్లోకి తలదూర్చవద్దు.
పరిహారాలుః కుజగ్రహానికి ఎరుపు పండ్లు నైవైద్యం, దీపారాధన చేయండి మంచి జరుగుతుంది.

కన్యారాశి : సోదర సహకారంతో పనులు పూర్తి, కుటుంబ సంతోషం, విందులు, స్నేహితుల కలయిక, పనుల్లో వేగం, దానాలు చేస్తారు, భార్యతో సఖ్యత.
పరిహారాలుః ఇష్టదేవతరాధన, నవగ్రహాలకు ప్రదక్షణ చేస్తే మంచిది.

తులారాశి : అనకున్నవి జరగవు, తగాదాలు, వాహనాలతో జాగ్రత్త, బంధువుల రాక, అనవసర విషయాల్లో జోక్యం వల్ల చెడు, భార్యతో మనస్పర్థలు,
పరిహారాలుః శివునికి దానిమ్మరసంతో అభిషేకం చేసుకోండి చక్కటి ఫలితాలు.

వృశ్చికరాశి : వ్యవహార నష్టం, కొత్త విషయాలు చర్చిస్తారు, బంధువుల గురించి చెడువార్తలు వింటారు, పనులు జాప్యం.
పరిహారాలుః నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు చేయండి చెడు నివారణ అవుతుంది.

ధనస్సురాశి : వ్యవహార నష్టం, కొత్త విషయాలు చర్చిస్తారు, భార్య తరపు వారి గురించి చెడువార్తలు వింటారు, ప్రయాణ సూచన. ఆర్థిక విషయాలు అనుకూలించవు.
పరిహారాలుః నవగ్రహాలకు 11 ప్రదక్షణలు దీపారాధన చేస్తే దోష ప్రభావం తగ్గుతుంది.

మకరరాశి : భార్యతో ప్రయాణం, దైవదర్శనం, శారీరక శ్రమ, అదాయానికి మించి ఖర్చులు, పనులు వాయిదా, కుటుంబంలో అపార్థాలు.
పరిహారాలుః నవగ్రహాలకు 11 ప్రదక్షణలు, దీపారాధన చేస్తే చెడుప్రభావం తగ్గుతుంది.

కుంభరాశి : కలహాలు, బాకీలు వసూలు కాక ఇబ్బందులు, పట్టుదల, కార్యనష్టం, వస్తునష్టం. వాహనాలతో జాగ్రత్త.
పరిహారాలుః కుజగ్రహానికి ఎర్రని పండ్లను నైవేద్యంగా సమర్పించి, ప్రదక్షణలు చేస్తే ప్రమాదాల నుంచి రక్షించబడుతారు.

మీనరాశి : స్త్రీ పరిచయం, అన్నింటా జయం, సుఖం, స్నేహితుల సహకారం, అధికారులతో ధనలాభం, వస్తువులు కొనుగోలు, విందులు, వినోదాలు.
పరిహారాలుః ఇష్టదేవతరాధన, నవగ్రహాలకు ప్రదక్షణలు చేస్తే చక్కటి ఫలితాలు.

READ ALSO  మాఘ భానువారం ఆర్కపుష్పంతో పూజ విశేషం ! ఫిబ్రవరి 17 రాశిఫలాలు

– కేశవ