సిఎస్ కి కీలక ఆదేశాలు ఇచ్చిన జగన్…?

తమిళనాడు సహా రెండు తెలుగు రాష్ట్రాలను ఇప్పుడు తుఫాన్ ఆందోళనలోకి నెట్టేసింది. దీనితో ఇప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళన రైతుల్లో ఎక్కువగా ఉంది. దీనిపై ఇప్పుడు సర్వత్రా కూడా ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. ఈ తరుణంలో ఏపీ సిఎం వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానికి కీలక ఆదేశాలు ఇచ్చారు. ఏం చేయాలో ఆయన పలు సూచనలు చేసారు.

హోం మంత్రి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్ తో సమావేశమై, విపత్తు నిర్వహణ బృందాలను అలెర్ట్ చేయాలని, తాను తిరుపతి పర్యటనకు వెళ్తున్నాను కాబట్టి తుఫాన్ కి సంబంధించి పక్కాగా చర్యలు తీసుకుని అధికారులకు పరిస్థితి ఆధారంగా ఆదేశాలు ఇవ్వాలి అని ఆయన సూచించారు. అంతే కాకుండా వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసి, వెంటనే తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు అంబులెన్స్ లు పంపాలని, 108 అంబులెన్స్ లను సమర్ధవంతంగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. అయితే సిఎం జగన్ తిరుపతి పర్యటనకు వెళ్తున్న నేపధ్యంలో అక్కడ ప్రధానితో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొంటారా లేక తాడేపల్లి వస్తారా అనే దానిపై స్పష్టత లేదు.