గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు మరింత హాట్ హాట్‌గా జరగనున్నాయి..బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీల మధ్య రాజకీయ వేడి పెరగనుంది..పోలింగ్ రోజు దగ్గర పడుతున్నాకొద్దీ గ్రేటర్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది..ఇప్పటికే రాజకీయ పార్టీల విమర్శలు ,ప్రతి విమర్శలతో హైదరాబాద్‌లో చలికాలంలో కూడా వేడి వాతావరణం కనిపిస్తుంది..టీఆర్‌ఎస్, ఎంఐఎం పోత్తులపై దూకుడుగా వ్యవహరిస్తున్న బీజేపీ తెలంగాణ నాయకత్వం..మరింత దూకుడు పెంచెందుకు జాతీయ నేతలను రంగంలోకి దిప్పుతుంది.
గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ ప్రచార బరిలోకి దిగనున్నట్లు బీజేపీ అధిస్ఠానం స్పష్టం చేసింది..అగ్రనేతల రంగ ప్రవేశంతో గ్రేటర్ ఎన్నికల ప్రచార ముఖ చిత్రమే మారనుంది..వీరి ప్రచారంతో గ్రేటర్ వాసుల మైండ్ సెట్ మారవచ్చు..కీలక సమయంలో అగ్ర నేతలు ప్రచారం చేయడంతో గ్రేటర్‌లో పరిస్థితులు తెలంగాణ బీజేపీకి అనుకూలంగా మారవచ్చు అంటున్నారు విశ్లేషకులు..ఇప్పటికే బీజేపీ అగ్రనేతల ప్రచారం కోసం ఉత్తరాది రాష్ట్రాల నుంచి తమ అనుచరులను హైదరాబాద్‌లో దించినట్లు తెలుస్తుంది..వారు ఆయా డివిజన్లలో పర్యటిస్తు ఓటర్ల అభిప్రాయాలు తెలుసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి..ఎప్పటి కప్పుడు నివేదికలు అగ్ర నేతలకు పంపిస్తున్నారట..అమిత్ షా, నడ్డా, యోగి ఎన్నికల ప్రచారంలో ఫోకస్ చేయాల్సిన అంశాలు ఇప్పటికే అధిస్ఠానం దృష్టికి వెళ్లినట్లు అంతర్గత సమాచారం.గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ అగ్ర నేతలు ముఖ్యంగా కేంద్ర హోం మంత్రి, పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా యోగి మంటి వారు ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొడంపై పలు విమర్శలు వస్తున్నాయి..తెలంగాణలో ఒక భాగమైన హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొడంపై ప్రజల్లో అనేక అనుమానాలకు దారి తీసాయి..తెలంగాణ బీజేపీ నాయకత్వంపై జాతీయ నాయకత్వానికి నమ్మకం లేనట్లు కనిపిస్తుంది..గ్రేటర్‌లో స్థానిక నాయకుల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి అనడానికి అగ్రనేతల ఎంట్రీనే నిదర్శనం అంటున్నారు..ఇటీవలే టికెట్ల కేటాయింపు,ప్రచారం బాధ్యతలపై బండి సంజయ్, కిషన్ రెడ్డి, రాజాసింగ్ వంటి కీలకల నేతల మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి..దీంతో సమాచారం జాతీయ నాకత్వానికి చేరడంతోనే రంగంలోకి అగ్రనేతలు దిగుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
మరోవైపు ఎన్నికల ప్రచారం కోసం పక్క రాష్ట్రాల నుంచి కార్యకర్తలను హైదరాబాద్‌లో దింపడంపై ప్రజల్లో పలు అనుమాలు రేకెచ్చిస్తున్నాయి..బీజేపీకి స్థానికంగా కార్యకర్తలు లేరా ? అందుకే ఇరత రాష్ట్రాల నుంచి రప్పించుకుంటున్నారా? అని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు..ఎన్నికల ప్రచారంలో స్థానికులకు, స్థానికేతరులకు గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు గ్రేటర్ వాసులు..భాగ్యనగర్‌లో మళ్లీ మత ఘర్షణలకు ఆస్కారం ఉందంటున్నారు..దీంతో రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగే అవకాశాలు ఉన్నాయని..గ్రేటర్ ప్రజలు ఎన్నికల ప్రచారంలో స్థానికేతరులతో జాగ్రత్తగా ఉండాలంటున్నారు పొలిటికల్ అనలిస్టులు.
మరోవైపు గ్రేటర్ ఎన్నికలను బీజేపీ జాతీయ నాయకత్వం ఇంతలా దృష్టి పెట్టడానికిగల కారణాలపై పోలిటికల్ సర్కిల్‌లో చర్చ జరుగుతుంది..ఈ ఎన్నికలతో రాష్ట్రంలో, దేశంలో రాజకీయంగా పెద్దగా మార్పులు ఏమీ జరగవు అయినా బీజేపీ ఎందుకు ఇంతలా ఫోకస్ పెట్టడంపై కాంగ్రెస్, టీఆర్‌ఎస్ మళ్లగుల్లాలు పడుతున్నాయి..హైదరాబాద్‌ను మినీ ఇండియాగా చాలా మంది పిలుస్తారు..ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు,అన్ని మతాల వారు నివసిస్తారు..రోహింగ్యాలు కూడా నివసిస్తున్నారు..హిందూ ముస్లీం,రోహింగ్యాల సమస్యలు, ఎన్‌ఆర్సీ, పౌరసత్వం వంటి అంశాలు వీరి ప్రచారంలో కీలకంగా మారనున్నాయి..బీజేపీ ఆగ్రనేతల ప్రచారంతో నగరంలో శాంతి భద్రతలపై ప్రభావం పడుతుందంటున్నారు అనలిస్ట్‌లు..ఆగ్ర నేతల ప్రచారం నేఫథ్యంలో గ్రేటర్‌లో భద్రతపై పోలీస్ వ్యవస్థ అప్రమత్తంగా ఉండాలంటున్నారు గ్రేటర్‌లోని పలు వర్గాల ప్రజలు.