బ్రేకింగ్: వాళ్లకు జగన్ గుడ్ న్యూస్

ఏపీ సిఎం వైఎస్ జగన్ చిరు వ్యాపారులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఏపీలో జగన్ సర్కార్ మరో పథకానికి శ్రీకారం చుట్టింది. చిరు వ్యాపారులకు జగనన్న తోడు అనే కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టారు. దీని ద్వారా చిరు వ్యాపారులకు బ్యాంకు ఋణం 10 వేలు ఇస్తుంది ఏపీ సర్కార్. గంపల్లో ఊరు ఊరు తిరిగే వారు, ఫుట్ పాత్ లు మీద వ్యాపారాలు చేసుకునే వాళ్ళు అర్హులు అని చెప్పింది ఏపీ సర్కార్.

మొదట 10 లక్షల మందికి రుణాలు ఇస్తారు. అయిదు అడుగుల కంటే తక్కువ స్థలంలో వ్యాపారాలు చేసే వారికి ఈ రుణాలు ఇస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన గుర్తింపు కార్డులు తప్పనిసరి కానున్నాయి. 6.40 లక్షల అప్లికేషన్ లను అర్హులుగా ఏపీ సర్కార్ గుర్తించింది. బ్యాంకు ఖాతాలు లేని వారికి బ్యాంకు ఖాతాలు ఇవ్వనున్నారు. గ్రామాల్లో 10 వేలు, పట్టణాల్లో 12 వేలు ఆదాయం ఉన్న వారికి ఇస్తారు.