పంచాయతీ కార్యాలయాలకు రంగుల మార్పుపై ఏపీలో జగన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. వెంటనే పంచాయతీ కార్యాలయలకు రంగులు మార్చాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అన్ని కార్యాలయాలకు తెలుపు రంగు మాత్రమే వేయాలని, వీటికి 14వ ఆర్థిక సంఘం నుంచి నిధులు ఖర్చు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. అలాగే అన్ని కార్యాలయాల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ బొమ్మ తప్పనిసరిగా ఉండాలని ఆదేశించింది. అంతకుముందు ఈ అంశంపై సుప్రీంకోర్టులోనూ విచారణ జరిగింది. ప్రభుత్వ కార్యాలయాలకు 4 రంగులు సరికాదని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది. వాటిని తొలగించాలని ఆదేశించింది. ఇందుకు నాలుగు వారాలు గడువిచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం రంగులపై నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
పంచాయతీ కార్యాలయాలకు రంగులపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం..!
-