జగన్ కు పెద్ద పరీక్షే పెట్టిన హైకోర్ట్…!

-

ఆంధ్రప్రదేశ్ లో అక్రమ మద్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. మద్యం అక్రమ రవాణా కాకుండా సిఎం జగన్ ఒక ప్రత్యేక విభాగాన్ని స్వయంగా ఏర్పాటు చేసారు. అయినా సరే పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే అక్రమ మద్యం మాత్రం ఏపీలో అసలు ఆగడం లేదు. దీనిపై చర్యలు కాస్త కఠినంగా తీసుకున్నా సరే అక్రమ మద్యం రావడంపై తీవ్ర స్థాయిలో సిఎం జగన్ కూడా అసహనంగానే ఉన్నారు. ఇక్కడి వరకు మనం వింటూ వస్తున్నది…

Jagan
Jagan

ఇప్పుడు తాజాగా ఏపీ హైకోర్ట్ ఒక సంచలన తీర్పు ఇచ్చింది. అసలు ఈ తీర్పు ప్రకారం ఒకసారి చూస్తే… ఇతర రాష్ట్రాల నుండి మద్యం ని తీసుకుని వచ్చే వ్యక్తులకు వెసులుబాటు కల్పిస్తూ ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. జీవో నెంబర్ 411 ప్రకారం మద్యాన్ని తీసుకుని వచ్చే వెసులుబాటు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ; హైకోర్టులో దాఖలైన టువంటి వ్యాజ్యాన్ని విచారించిన ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. ఈ తీర్పు ప్రకారం ఎవరైనా ఇతర రాష్ట్రాల నుండి మూడు మద్యం బాటిళ్లు తెచ్చుకోవచ్చని హైకోర్టు స్పష్టంగా చెప్పింది.

ఇప్పుడు ఈ తీర్పుతో కచ్చితంగా నష్టపోయేది ఏపీ సర్కార్. అవును ఏపీ సర్కార్ భారీగా నష్టపోయే సూచనలే ఉన్నాయి. 13 జిల్లాలు ఏపీలో ఉంటే, 12 జిల్లాలు ఇతర సరిహద్దులను పంచుకుని ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లాకు కాస్త సరిహద్దు దూరమే. అయినా చత్తీస్ఘడ్ సరిహద్దు ఉంది. అయినా సరే ఖమ్మం జిల్లా నుంచి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాలకు తెలంగాణా సరిహద్దుగా ఉంది. కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడపకు కర్ణాటకకు సరిహద్దులుగా ఉన్నాయి. ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు ఓడిశా సరిహద్దులు పంచుకుంది.

అంటే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం మరింతగా నష్టపోయే సూచనలు ఉన్నాయి. ఏపీలో మద్యం నాణ్యతపై, ధరలపై ఇతర రాష్ట్రాల్లో కూడా విమర్శలు వస్తున్నాయి. అందుకే ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చి ఏపీలో విక్రయిస్తున్నారు. ఇప్పుడు హైకోర్ట్ ఇచ్చిన తీర్పుతో ఒక పది మంది తలొక బండి వేసుకుని వెళ్లి తలో మూడు ఫుల్ బాటిల్స్ తెచ్చుకోవచ్చు. అంటే 30 బాటిల్స్ ఈజీగా వస్తాయి. అప్పుడు పోలీసులు కూడా చేసేది ఏమీ ఉండదు. కేసులు నమోదు చేస్తే అంతిమంగా ఇబ్బంది పడేది పోలీసులే. కాబట్టి ఏపీలో మద్యం ధరలు తగ్గించడం మినహా సిఎం జగన్ ముందు మరో మార్గం లేదు. మద్యం బ్రాండ్ లు కూడా ప్రముఖమైనవి తీసుకు రావాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news