మేము ఇవ్వలేం… సిబిఐ విషయంలో ఏపీ హైకోర్టు షాక్

-

విశాఖ డాక్టర్ సుధాకర్ వ్యవహారంపై విచారణ చేసి ఇంటీరియం రిపోర్ట్ హైకోర్టుకు అందజేసింది సీబీఐ. ఇంటీరియం రిపోర్ట్ కాపీ ఇవ్వాలని కోరిన ప్రభుత్వ తరపు న్యాయవాదికి కోర్టు షాక్ ఇచ్చింది. విచారణ మధ్యలో ఉన్న కారణంగా పోలీసులకు సంబంధించిన కేసు డైరీ పబ్లిక్ చేయలేమని, కాపీ ఇవ్వలేమను న్యాయస్థానం స్పష్టం చేసింది. కుట్ర కోణం దాగుందని భావిస్తున్నామని మరో 2 నెలలపాటు తుది నివేదిక ఇవ్వటానికి సమయం కోరిన సీబీఐ విజ్ఞప్తికి కోర్టు అంగీకరించింది.

తుది నివేదిక నవంబర్ 11 లోపు ఇవ్వాలని ఆదేశించింది ఏపీ హైకోర్టు. తదుపరి విచారణ నవంబర్ 16కి వాయిదా వేసింది న్యాయస్థానం. ఇప్పటికే 100 మంది సాక్షులను విచారించమని, రెండు ఎఫ్ ఐ ఆర్ లు నమోదు చేశామని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చింది సీబీఐ. డాక్టర్ సుధాకర్ మాస్కులు అడిగారని ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి కూడా ఈ వ్యవహారం రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారింది. జాతీయ స్థాయిలో ఈ వ్యవహారం వైరల్ అయింది

Read more RELATED
Recommended to you

Latest news