కేసీఆర్ వ్యాఖ్య‌ల‌పై మండిప‌డ్డ ఏపీ మంత్రులు

-

AP Ministers Fires & Comments on KCR Speech

విజయవాడ: చ‌ంద్ర‌బాబునాయుడుపై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై సాంఘిక సంక్షేమ‌శాఖ‌ మంత్రి నక్కా ఆనందబాబు, మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డిలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పోటుగాడు త‌న్నుకోవ‌డానికి వ‌స్తాడా? రమ్మనండి అంటూ సవాల్ విసిరారు. ‘కేసీఆర్ నీకు సిగ్గుందా?.. నీలాంటి నీచుడు రాజ‌కీయాల్లో ఉండ‌రు’ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ కుటుంబం సోనియా కాళ్లు నాకారని దుయ్యబట్టారు. తెలంగాణలో యువ‌త‌ను ఉచ‌కోత కోస్తే… 2009లో చంద్రబాబుతో ఎందుకు పొత్తుపెట్టుకున్నావని మంత్రి ఆనంద్‌బాబు ప్రశ్నించారు. కేసీఆర్‌ది దొంగ దీక్ష అని, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సే అని చెప్పుకొచ్చారు.

ప్రజల్లో ఉన్న అసంతృప్తిని కప్పిపుచ్చుకునేందుకే తమపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌ రోడ్లను చూసి సిగ్గు పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. హైదరాబాద్‌ కేసీఆర్‌ అబ్బ సొత్తా? అని…తమకు పదేళ్ల హక్కు ఉందని ఆనందబాబు స్పష్టం చేశారు.ఓటమి భయంతోనే కేసీఆర్ చంద్రబాబుని టార్గెట్ చేశారని ఏపీ మంత్రి ఆదినారాయణ ఆరోపించారు. కేసీఆర్‌కి నోటి దురద ఎక్కువై అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. వ్యక్తుల్ని కించపరచడం కేసీఆర్ నైజం అని మండిపడ్డారు. జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఎక్కడికైనా వెళ్తారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news