ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రులు అందరూ ముక్కుమ్మడిగా రాజీనామా చేశారు. ఈ రోజు ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాబినేట్ సమావేశం జరిగింది. ఈ సమావేశ అనంతరం 24 మంది మంత్రులు.. రాజీనామా చేశారు. తమ రాజీనామా పత్రాలను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సమర్పించారు. కాగ ఈ రాజీనామా పత్రాలను గవర్నర్ భిశ్వ భూషణ్ హరి చందన్ కు రాష్ట్ర ప్రభుత్వం పంపనుంది.
గవర్నర్ కూడా 24 మంది మంత్రుల రాజీనామా లకు ఈ రోజు వరకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ రోజు రాష్ట్ర మంత్రి వర్గం చివరి సారి భేటీ అయింది. ఈ మంత్రి వర్గ సమావేశంలో మంత్రులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే ముఖ్య మంత్రి వైఎస్ జగన్ ఆదేశాల ప్రకారం.. రాజీనామా చేశారు. కాగ కొత్త మంత్రి వర్గం ఏర్పాటు కూడా ముఖ్య మంత్రి వైఎస్ జగన్ కసరత్తులు మొదలు పెట్టారు. కొత్త మంత్రి వర్గానికి ఈ నెల 11 వ తేదీ మూహుర్తం ఖరారు చేశారు.