బీజేపీ హవా ఇప్పుడు దేశంలో ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే నార్త్‌లో బలంగా ఉన్న ఈ పార్టీ ఇప్పుడు సౌత్‌లో కూడా బలపడాలని చూస్తోంది. మరీ ముఖ్యంగా ఆంధ్రాలో ఎలాగైనా పాగా వేసేందుకు ఇప్పటికే జనసేనతో పొత్తు కూడా పెట్టుకుంది. ఇక బీజేపీ వ్యూహాలను కనిపెట్టిన వైసీపీ దాన్ని ఆదిలోనే నిలువరించాలని చూస్తోంది. అయితే ఈ క్రమంలో అనవరంగా బీజేపీని హైలెట్ చేస్తోంది వైసీపీ.
ప్రస్తుతానికి ఏపీలో బీజేపీ తరఫున మాధవ్ ఒక్కరే ఎమ్మెల్సీగా ఉన్నారు తప్ప ఇంకెవరూ ప్రజా ప్రతినిధులు లేరు. ఇక ఏపీలో కూడా బీజేపీ బలం అంతంతే అని చెప్పాల్సిందే. ఇక ఇప్పుడు వరుస ఎన్నికల్లో ఓడిపోవడంతో అసలు ప్రజలను ప్రభావితం చేసేంత శక్తి కూడా బీజేపీకి తగ్గిపోయిందనే చెప్పాలి. అయితే ఇప్పుడు వైసీపీ నేతలే అనవసరంగా బీజేపీపై విమర్శు చేయడం దాన్ని ఉనికి పెంచుతోంది.
ఇక రీసెంట్ గా వైసీపీ మంత్రి పేర్ని నాని బీజేపీపై ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. బీజేపీ నేతలు ఏకంగా ఏపీలోని వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు పెద్ద ఎత్తున ప్లాన్ వేస్తున్నారని అది ఎంతకూ జరగదని చెప్పారు. దీంతో కుట్రలు చేస్తోందని ఆరోపించారు. అయితే అసలు ఏపీలో ఏ మాత్రం బలం కాషాయ పార్టీ ప్రభుత్వాన్ని ఎలా కూలుస్తుందంటూ? రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విధమైన కామెంట్లతో అనవసరంగా హైలెట్ అవుతుందని చెప్తున్నారు. టీడీపీ నుంచి తమ విమర్శలను బీజేపీకి మళ్లిస్తే వైసీపీనే కావాలని హైలెట్ చేస్తోందని తెలుపుతున్నారు.