అరస్ట్ .. అరస్ట్ .. అరస్ట్ – చంద్రబాబు కి పెను సవాల్ !

-

రాజకీయంగా చంద్రబాబు భయంకరమైన సమస్యలతోపాటు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాల దెబ్బకి టిడిపి పార్టీని ముందుకు నడిపించడానికి ప్రస్తుతం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు ఇదే పరిస్థితి వేరే పార్టీకి వస్తే ఖచ్చితంగా ఆ పార్టీకి చెందిన అధ్యక్షుడు రాజకీయాల నుండి తప్పుకోవటం జరుగుతుందని కానీ చంద్రబాబు కాబట్టి ప్రతిపక్షంలో తక్కువ సభ్యులు ఉన్నా గాని తన చాణిక్య రాజకీయంతో పార్టీని ముందుకు నడిపిస్తున్న రాజకీయవిశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ప్రజా సమస్యలపై రాష్ట్రంలో పోరాడాలని అడుగులు వేస్తుంటే మరోపక్క జగన్ ప్రభుత్వం అడ్డుకోవటమే టార్గెట్ గా వ్యవహరిస్తున్నట్లు ప్రస్తుత సందర్భాలు చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్ర చేపట్టడం జరిగింది. ఇటీవల ప్రకాశం మరియు కుప్పంలో పర్యటించిన చంద్రబాబు ఉత్తరాంధ్రలో కూడా పర్యటించాలని భావించిన చంద్రబాబుని విశాఖపట్నం విమానాశ్రయం దగ్గర ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా హైలెట్ న్యూస్ అయ్యింది.

 

దీంతో జగన్ ప్రభుత్వం పై టిడిపి నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఒక రౌడీ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు అని తీవ్రస్థాయిలో చంద్రబాబును అరెస్టు చేయడం పట్ల సీరియస్ అవుతున్నారు. అయితే తాజా అరెస్టుతో చంద్రబాబుని ఏకంగా జగన్ ప్రభుత్వం తొమ్మిది నెలల పరిపాలనలో ఐదుసార్లు అరెస్టు చేయటం జరిగింది. ఫస్ట్ టైం ఇసుక, చలో ఆత్మకూరు, అమరావతి జేఏసీ బస్సు యాత్ర టైం లో రెండుసార్లు చంద్రబాబు అరెస్ట్ చేశారు. ఈ విధంగా ప్రతిసారీ ప్రజా సమస్యల విషయంలో బాబు ని టార్గెట్ చేస్తూ అరస్ట్ .. అరస్ట్ .. అరస్ట్ చేయడంతో అధికార పార్టీ పై పోరాటం అన్నది చంద్రబాబుకి పెనుసవాలుగా మారింది. 

Read more RELATED
Recommended to you

Latest news