దుమారం రేపుతున్న అర‌వింద్ కామెంట్లు.. బీజేపీ లో టెన్ష‌న్‌..

-

రీసెంట్ గా సీఎం కేసీఆర్ ఢిల్లీలో ప‌ర్య‌టించి వ‌రుస‌గా కేంద్ర పెద్ద‌ల‌ను క‌లిశారు. అయితే దీనిపై అప్ప‌టి నుంచే పెద్ద దుమారం రేగుతోంది. మ‌రీ ముఖ్యంగా ఆయ‌న టూర్ బీజేపీని ఇర‌కాటంలో పెట్టేసింది. కేసీఆర్ ఢిల్లీలోనే రోజులు ఉండి మంత‌నాలు జ‌ర‌ప‌డంతో తెలంగాణ రాజకీయవర్గాల్లో ఈ అంశం బాగా దుమారం రేపింది. ఓ ద‌శ‌లో అయితే కేసీఆర్ బీజేపీతో క‌లిసిపోయారని ఆ రెండు పార్టీల మ‌ధ్య ఒప్పందం కుదిరింద‌ని టీపీసీసీ చీఫ్ చీప్ రేవంత్ రెడ్డి ప‌దే ప‌దే ఆరోపించారు. బీజేపీ, టీఆర్ ఎస్ ఒక్క‌టేనంటూ సోష‌ల్ మీడియాలో కూడా పుకార్లు వ‌చ్చాయి.

Dharmapuri Arvind

ఇలాంటి త‌రుణంలో నిజామాబాద్ ఎంపీ అయిన‌టువంటి ధ‌ర్మ‌పురి అరవింద్ చేస్తున్న కామెంట్లు అటు టీఆర్ ఎస్‌లో ఇటు బీజేపీలో కూడా సంచలనం రేపుతోంది. కేసిఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లింది బీజేపీతో పొత్తు కోసం కాద‌ని ఆయ‌న కొడుకును కాపాడుకునేందుకని సంచ‌ల‌నం రేపారు. రీసెంట్ గా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఓ విష‌యంలో కేటిఆర్ కు నోటీసులు ఇచ్చారని, ఇక ఆ విష‌యంలో కేటీఆర్ ఇరుక్క‌పోవ‌డంతో ఆయ‌న్ను కాపాడుకునేందుకు జైలుకు వెల్ల‌కుండా చూసేందుకు కేసిఆర్ ఢిల్లీకి వెళ్లార‌న్నారు.

తాము నిర్వ‌హిస్తున్న తెలంగాణ విమోచ‌న దిన స‌భ‌కు విచ్చేస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ద్వారా త‌న‌కు ఈ విష‌యం తెలిసింద‌ని సంచ‌ల‌నం రేపారు. అయితే ఆయ‌న చేసిన కామెంట్లు టీఆర్ ఎస్ తో పాటెఉ ఇటు సొంత పార్టీ అయిన బీజేపీలో ర‌చ్చ ర‌చ్చ చేస్తున్నాయి. ఓవైపు బండి సంజ‌య్ కేసీఆర్‌ను, కేటీఆర్‌ను తాము అధికారంలోకి రాగానే జైలుకు వెళ్ల‌డం ఖాయ‌మ‌ని చెబుతుంటే కేంద్ర బీజేపీ నేత‌లు కేటీఆర్‌ను కాపాడుతున్నారా అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. దీంతో బీజేపీ చెబుతోంది వ‌ట్టిదేన‌ని కేటీఆర్ ను కేంద్ర నాయ‌క‌త్వం కాపాడుతోందంటూ విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news