అశోక్ గజపతి రాజు సంచలన వ్యాఖ్యలు, తండ్రిని మార్చే కూతుళ్ళు ఉంటారా…?

మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ సంచయిత గజపతి రాజుపై మాజీ కేంద్ర మంత్రి అశోక్‍ గజపతిరాజు సంచలన వ్యాఖ్యలు చేసారు. చరిత్రలో తండ్రులు మార్చేవారు ఎవరైనా ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు. సోషల్ మీడియాలో మీ తండ్రి ఎవరో మీరే పోస్టు చేశారు అని సంచయితను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేసారు. సోషల్ మీడియాలో మీరు చేస్తున్న పోస్టులే మీరేంటో చెబుతాయి అని సంచాయితను ఉద్దేశించి అన్నారు.

ఎవరో పెట్టిన పోస్టులకు నేను సమాధానం చెప్పడం నా ఖర్మ అని ఆయన ఆవేదనగా వ్యాఖ్యలు చేసారు. చట్ట విరుద్ధంగా నన్ను తొలగించారు అని మండిపడ్డారు. చైర్మన్ పోస్ట్ అపాయింటింగ్ పోస్ట్ కాదు, ఆనవాయితీగా వచ్చే పోస్ట్ అని స్పష్టం చేసారు. సంచయిత 105 ఆలయాల్లో ఒక్క పండక్కి కూడా హాజరుకాలేదు అన్నారు. తండ్రి, తాతను ఎప్పుడూ సంచయిత కలవలేదు అని ఆయన వ్యాఖ్యానించారు. మాది కుటుంబ సమస్య కాదు, ఆలయాలు భక్తులవన్నారు.