బాబులను అడ్డంగా ఇరికించిన అచ్చెన్నాయుడు!

-

ప్రపంచం మొత్తం ఒక సమస్యతో బాదపడుతుంటే… ఏపీ టీడీపీ నేతలు మరోసమస్యతో బాదపడుతున్నట్లుంది! బాబోయ్ కరోనా.. అమ్మో కరోనా అని అన్ని రాష్ట్రాల్లోని అధికార పక్షాలు, ప్రతిపక్షాలు కరోనా పై పోరాటం చేస్తుంటే… ఏపీ ప్రతిపక్షం నేతలు మాత్రం రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు అనడంలో సందేహం లేదనే చెప్పాలి! ఈ క్రమంలో తాజాగా వయసుల అడ్డుపెట్టుకుని జగన్ పై విమర్శలు గుప్పించి సంతృప్తి చెందారు ఏపీ టీడీపీ నేత అచ్చెన్నాయుడు! దీంతో చంద్రబాబు.. లోకేష్ బాబు లపై కామెంట్స్ పడేలా చేశారు!

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో నివారణ చర్యలతోపాటు ప్రజల్ని కాపాడుకోవడానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు క్షేత్రస్థాయిలో పని చేస్తుంటే.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రం రాజప్రాసాదం వీడటంలేదని మొదలుపెట్టిన అచ్చెన్నాయుడు… అందుకు కొన్ని ఉదాహరణలు చూపిస్తూ.. క్షేత్ర స్థాయిలో కనిపించిన కొందరు సీఎంలను (పెద్ద వయసు చూసుకున్నట్లున్నారు) ఉదాహరణలుగా చూపించే ప్రయత్నం చేశారు! అంతా బయట కనిపిస్తున్నారు కానీ… యంగ్ సీఎం అయిన జగన్ మాత్రం కనిపించడం లేదని చెప్పుకొచ్చారు. దీంతో అచ్చెన్నాయుడిపై ప్రశ్నల వర్షాలు కురవడం మొదలయ్యాయి!

ప్రజలకు ఈ సమయంలో క్షేత్రస్థాయిలో పనిచేయాలంటే అది ముఖ్యమంత్రే కానక్కరలేదు అన్న విషయం అచ్చెన్నాయుడు మరిచినట్లున్నారు! పక్కనే ఉన్న తెలంగాణ విషయానికొస్తే… తెలంగాణ సీఎం సమిక్షల్లో బిజీగా ఉంటే… కేటీఆర్ మాత్రం క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉన్నారు! అదే విదంగా… సీఎం స్థాయిలో జగన్ రాష్ట్రం మొత్తం ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, సూచనలు చేస్తూ ఉంటే… ఆయా శాఖ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ.. ప్రజలకు ఏలోటూ రాకుండా చూసుకుంటున్నారు. ఈ విషయాలను గ్రహించడంలో విఫలమయిన అచ్చెన్నాయుడు… ఇలాంటి విమర్శలకు దిగారు!

ఇదే సమయంలో… ప్రజలకు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తమకున్న పరిధిమేర సాయం చేయాలన్నా, క్షేత్రస్థాయిలో పని చేయాలన్నా… అందుకు ముఖ్యమంత్రే కానక్కర్లేదు కదా!! పోని చంద్రబాబు అయితే 70 దాటేశారు కాబట్టి “ఇక రెస్ట్” అని అచ్చెన్నాయుడు భావించినా… జగన్ కంటే 10ఏళ్లు చిన్నవాడైన లోకేష్ ఏమిచేస్తున్నట్లు? పోని ఏపీకి వచ్చే అవకాశం లేకపోయినా… హైదారాబాద్ లో ఏపీ వాసులు లేరా.. తెలంగాణ ప్రజలపట్ల లోకేష్ కి బాధ్యత లేదా? ప్రజలకు సాయం చేయలంటే పదవే ఉండాలా.. సీఎం చైర్ లో కూర్చుంటేనే ప్రజల గురించి ఆలోచించాలా? పోనీ చంద్రబాబు కంటే చిన్నవాడు అయిన అచ్చెన్నాయుడు ఏమి చేస్తున్నట్లు? పోనీ ఆయన జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు లేకపోవచ్చు కానీ… లాక్ డౌన్ అయితే అమలవుతుంది కదా.. ప్రజలకు ఇబ్బందులైతే ఉంటాయి కదా! ఇవన్నీ అచ్చెన్నాయుడికే తెలియాలి!

Read more RELATED
Recommended to you

Latest news