బాహుబలిగా డొనాల్డ్ ట్రంప్.. వైర‌ల్ అవుతున్న వీడియో..!

-

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పర్యటనకు మ‌రికొన్ని గంట‌లే మిగిలి ఉండడంతో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నగరం సర్వాంగ సుందరంగా మారింది. అహ్మదాబాద్‌ నగరంలోని మోతేరా స్టేడియంలో జరిగే నమస్తే ట్రంప్‌ కార్యక్రమానికి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాహుబలి అమెరికా అధ్యక్షుడు డొనాాల్డ్ ట్రంప్ కనిపిస్తే… అదే వీడియోలో ఇతర పాత్రల్లో ఇవాంకా ట్రంప్, మెలానియా తదితరులు ఉంటే… ఆ వీడియోనే ఇది. ఎవరో సృష్టించిన ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఇక రేపటి నుంచి ఇండియాలో ట్రంప్ పర్యటన ప్రారంభం కానుండగా, ‘బాహుబలి’ టైటిల్ సాంగ్‌ తో ఓ వీడియోను తయారు చేశారు.

సుమారు రెండు నిమిషాల‌ నిడివి ఉన్న ఈ వీడియోలో ప్రబాస్‌, రానాల ముఖాలకు ట్రంప్ ముఖాన్ని అతికించి బ్యాక్‌ గ్రౌండ్‌ లో ‘జియోరే బాహుబలి’ పాటను జోడించారు. ఇక ఈ వీడియోలో మెలానియా, ఇవాంకాలతో పాటు ట్రంప్ కుమారుడు కూడా కనిపిస్తున్నారు. చివర్లో ‘యుఎస్ఏ అండ్ ఇండియా యునైటెడ్’ అన్న క్యాప్షన్ కూడా ఉంది. ఈ ట్వీట్ పై ట్రంప్ స్వయంగా స్పందిస్తూ, “ఇండియాలో తనకు గొప్ప స్నేహితులు ఉన్నారు” అని రీ ట్వీట్ చేయడం విశేషం. మ‌రి ఈ వీడియో మీరూ చూసేయండి.

Read more RELATED
Recommended to you

Latest news