కవిత్‌కు బెయిల్.. నా వ్యాఖ్యల పట్ల విచారం తెలుపుతున్నా : సీఎం రేవంత్

-

కవిత బెయిల్ పిటిషన్ విషయంలో తాను చేసిన వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. భారత న్యాయవ్యవస్థపై తనకు అంతులేని విశ్వాసం ఉందని చెప్పారు. కొన్ని వార్తా పత్రికలు కావాలనే తన వ్యాఖ్యలను తప్పుగా అన్వయించి ప్రచురించాయని, తన వ్యాఖ్యలు కోర్టును కించపరిచినట్లు పేర్కొన్నాయన్నారు. ఏదేమైనా న్యాయవ్యవస్థ, దాని స్వతంత్రతను నమ్మే వ్యక్తిగా తన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

ఇదిలాఉండగా, గురువారం సీఎం రేవంత్ రెడ్డికి చెందిన ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. విచారణ పిటిషన్‌ను పక్క రాష్ట్రానికి బదిలీ చేయాలని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం డిస్మిస్ చేసింది. ఈ నేపథ్యంలో జగదీశ్ రెడ్డి న్యాయవాది కవిత్ బెయిల్ తీర్పు విషయమై రేవంత్ చేసిన వ్యాఖ్యలను ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లగా.. ఒక రాష్ట్రానికి సీఎం స్థాయిలో ఉండే వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని సుప్రీంకోర్టు హితవు పలికింది.అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ తమ ఓటు బ్యాంకును బీజేపీకి బదిలీ చేసిందని..ఆ ఒప్పందంలో భాగంగానే కవితకు ఐదు నెలల్లోనే బెయిల్ వచ్చిందని, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంకా జైలులోనే ఉన్నారని రేవంత్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news