లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కు బెయిల్…కానీ..?

-

బీహార్ మాజీముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ గురించి తెలియని వారు ఉండరు. 1990 వ సంవత్సరంలో లాలూ బీహార్ ముఖ్యమంత్రి పదవి కొనసాగింపులో ఉన్నారు. అయితే అయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చోటు చేసుకున్న పశుగ్రాసం కుంభకోణం కేసులో లాలూ ని దోషిగా తేల్చారు. అయితే 2017 డిసెంబరు నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లోనే ఉన్నారు.బెయిల్ మీద బయటకు రావడానికి అనేక ప్రయత్నాలు చేసారు. కానీ ఫలితం లేకపోయింది. కానీ ఇప్పుడు ఈ వార్త ఆయనకి కొంచెం ఊరట కలిగిస్తుంది.ఆ వార్త ఏంటి అనుకుంటున్నారా..?? అసలు వివరాలలోకి వెళితే పశుగ్రాసం కుంభకోణానికి సంబంధించిన కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు ఝార్ఖండ్‌ హైకోర్టు శుక్రవారం బెయిల్‌ మంజూరు చేసింది. చైబసా ఖజానా కేసులో లాలూకు న్యాయస్థానం బెయిలిచ్చినట్లు సమాచారం.

అయితే 2 లక్షల రూపాయల పూచికత్తుపై దీనిని మంజూరు చేసింది. అయితే బెయిల్‌ వచ్చినా లాలూ విడుదలయ్యే అవకాశం లేదు. దుమ్కా ఖజానా కేసులో శిక్ష పడినందున ఆయన జైల్లోనే ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ గమనించాలిసిన విషయం ఏంటంటే మరికొద్ది రోజుల్లో బిహార్‌లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. మరి ఈ ఎన్నికలకు లాలూ అందుబాటులో ఉంటారో,లేదో అనేది రానున్న రోజుల్లో చూడాలి. జైల్లో ఉన్న లాలూ తరచుగా ఎదో ఒక అనారోగ్యానికి గురవుతుండటం వల్ల, కరోనా వైరస్ పరిస్థితుల దృష్ట్యా ఆయనకు పెరోల్‌ ఇవ్వాలని ఇటీవల లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్‌ కోరినట్లు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news