దారితప్పిన ‘సైకిల్’..అదుపుతప్పిన ‘తమ్ముళ్ళు’.!

-

40 ఏళ్ల చరిత్ర గల తెలుగుదేశం పార్టీ కథ సమాప్తం అయ్యేలా ఉంది. ఇప్పటికే తెలంగాణలో మూతబడింది..ఇప్పుడు ఏపీలో కూడా మూతబడే దశకు వచ్చేసినట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో జగన్ దెబ్బకు చాలావరకు టి‌డి‌పి నష్టపోయింది. ఇప్పుడు ఊహించని విధంగా స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్ళడంతో పార్టీ కథ ముగింపు దశకు వచ్చింది. పెద్ద దిక్కు జైలు పాలవ్వడంతో కేడర్ దిక్కుతోచని పరిస్తితిలో ఉంది.

ఇక పార్టీని నడిపించాల్సిన లోకేష్ ఏమో ఢిల్లీలో సెటిల్ అయ్యారు. ఏపీకి వస్తే ఎక్కడ అరెస్ట్ చేస్తారనే భయం వెంటాడుతుంది. ఇటు బాలయ్య, బ్రాహ్మణి, భువనేశ్వరిలకు పార్టీ నడిపించే సత్తా లేదు. వాళ్ళు ఎన్ని చేసిన ఉపయోగం లేదు. ఈ క్రమంలో నేతలకు ఫ్రస్టేషన్ పెరిగిపోతుంది. ఎవరు ఎప్పుడు ఎలా మాట్లాడుతున్నారో తెలియడం లేదు. ఎడాపెడా నోరు పారేసుకుంటున్నారు. సీనియర్లు సైతం అదుపు తప్పి మాట్లాడుతున్నారంటే టి‌డి‌పి పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికే అయ్యన్నపాత్రుడు లాంటి వారు సి‌ఎం జగన్‌ని ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో తెలిసిందే. దారుణంగా బూతులు మాట్లాడుతున్నారు.

ఇక మరో సీనియర్ బండారు సత్యనారాయణమూర్తి.. ఒక మహిళా మంత్రి అయినా రోజాపై తీవ్ర పదజాలంతో దూషణలకు దిగారు. రోజా ఇటీవల బాలయ్య గురించి రాజకీయ పరమైన విమర్శలు చేశారు. వాటికి కౌంటర్ ఇవ్వడం వేరు.. కానీ బండారు మాత్రం రోజా సినీ జీవితం గురించి తప్పుగా మాట్లాడుతూ.. దారుణమైన పదజాలం వాడారు. దీనిబట్టి చూస్తే టి‌డి‌పి నేతలు ఎంత దిగజారిపోయారో అర్ధమవుతుంది. అదే విషయాన్ని రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా చెబుతూ.. మహిళా మంత్రిపైనే ఇలా మాట్లాడితే..రాష్ట్రంలో సాధారణ మహిళల పరిస్తితి ఏంటి? అనేది అందరినీ ఆలోచించేలా చేస్తుంది.

ఇక రోజురోజుకూ పార్టీ పరిస్తితి దారుణంగా తయారవ్వడంతోనే ఇలా మాట్లాడుతున్నారని తెలుస్తోంది. సీనియర్ నేత అయ్యి ఉండి కూడా బాబు దగ్గర మార్కులు కొట్టేయడానికి బండారు దారుణంగా దిగజారిపోయారు. ఇలాంటి వారికి ప్రజాక్షేత్రంలోనే తగిన శాస్తి జరుగుతుందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news