అలాంటి కామెంట్లు బండి సంజయ్ కు ఇబ్బందులు తెస్తున్నాయా..

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నోటి నుంచి ఏదైనా మాట బ‌య‌ల‌కు వ‌చ్చిందంటే అది కచ్చితంగా పెద్ద దుమారం రేపే విధంగా ఉంటోంది ఈ మ‌ధ్య‌. మ‌రీ ముఖ్యంగా ఆయ‌న హిందూ స‌మాజం విష‌యంలో ఏది మాట్లాడినా అది చివ‌ర‌కు సంచ‌ల‌న‌మే అవుతోంద‌ని చెప్పాలి. ఇక‌పోతే ఇప్పుడు ఆయ‌న ప్ర‌జా సంగ్రామ యాత్ర‌తో చాలా బిజీగా ఉంటున్నారు. ఇక ఇందులో భాగంగా అక్క‌డ‌క్క‌డా మీటింగులు పెడుతూ మాట్లాడుతున్నారు. కాగా నిన్న సంగారెడ్డిలో కూడా ఓ స‌భ నిర్వ‌హించి ఆయ‌న మాట్లాడారు.

Bandi Sanjay Kumar | బండి సంజ‌య్
Bandi Sanjay Kumar | బండి సంజ‌య్

అయితే ఇందులో ఆయ‌న మాట్లాడుతూ చేసిన కామెంట్లు ఇప్పుడు తీవ్ర చ‌ర్చనీయాంశంగా మారాయి. ఏకంగా త‌మ‌కు అధిక‌రం వ‌చ్చేస్తుంది అన్న‌ట్టు చెప్పారు. ఇక అధికారం వ‌స్తే మొద‌ట‌గా యూపీలో తీసుకువ‌చ్చిన‌ట్టు తెలంగాణ‌లో కూడా జనాభా నియంత్రణ బిల్లును తీసుక‌వ‌స్తామ‌ని ప్ర‌క‌టించారు. కాగా ఈ బిల్లు తేవ‌డానికి కార‌ణం ఇప్పుడు ఉన్న ముస్లిం రేజర్వేషన్ల వల్ల హిందూ స‌మాజంలోని బీసీల‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని చెప్పారు.

వారికి రిజ‌ర్వేష‌న్లు ఇవ్వ‌డం వ‌ల్ల బీసీ వ‌ర్గాల‌కు రావాల్సిన రావాల్సిన ఫ‌లాలు అంద‌ర‌కుండా పోతున్నాయ‌ని వాపోయారు. ఇక మ‌రీ ముఖ్యంగా తెలంగాణ‌లో ఆ వ‌ర్గం ఎక్కువ‌గా ఉండ‌టం వల్ల హిందూ స‌మాజానికి అన్యాయం జ‌రుగుతోంద‌న్నారు. అయితే ఇక్క‌డే ఆయ‌న మాట‌లు కాస్త వివాదానికి దారి తీస్తున్నాయి. యూపీలో అంటే విప‌రీత‌మైన జ‌నాభా ఉంది కాబ‌ట్టి అక్క‌డ ఆ చ‌ట్టం తెస్తే ప్రాబ్ల‌మ్ లేదు. కానీ ఐదుకోట్లు జ‌నాభా క‌డా లేని తెలంగాణ‌లో ఇలాంటి చ‌ట్టం తెస్తే హిందు స‌మాజం ఎదుగుద‌ల ఆగిపోతుంది. ఇంకా చెప్పాలంటే హిందూ జ‌నాభా త‌గ్గిపోతుంది. ఇదే ఇప్పుడు హిందూ సంఘాల నుంచి ఆయ‌నకు స‌మ‌స్య‌లు తెస్తోంది.