బ్రేకింగ్: కీలక తెరాస నేతతో బండి సంజయ్ భేటీ

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమయంలో తెరాస పార్టీకి వరుసగా దెబ్బలు తగులుతున్నాయి. తెరాస పార్టీ నేతలను కొందరిని బిజెపి ప్రత్యేకంగా టార్గెట్ చేస్తుంది. ఎవరు అయితే అసహనంగా ఉన్నారో వారు అందరిని ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ కి చెందిన కొందరికి బిజెపి కండువా కప్పిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ కి చెందిన మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణతో నిన్న బిజెపి నేతలు భేటీ అయ్యారు.

ఆయన పార్టీ నుంచి బయటకు రావడానికి రెడీ అయ్యారు. అలాగే మాజీ ఎంపీ కొండా విశ్వేసర్ రెడ్డి తో కూడా భేటీ అయ్యారు. తాజాగా మరో నేతన్ను టార్గెట్ చేసారు. మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ గత కొన్ని రోజులుగా తెరాస అధిష్టానం మీద ఆగ్రహంగా ఉన్నారు. పలు సందర్భాల్లో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు ఆయనను బిజెపిలోకి ఆహ్వానించే ప్రయత్నంలో భాగంగా బండి సంజయ్, లక్ష్మణ్ వెళ్లి సమావేశం అయ్యారు.