సోనియా ఆశీర్వాదం.. అందుకే బీజేపీ లోకి వెళ్తున్నా..!

కాంగ్రెస్లో కీలక నేతగా కొనసాగుతున్న మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ బీజేపీ గూటికి వెళ్ళిపోతున్నారా అంటే గత కొన్ని రోజుల నుంచి అవుననే టాక్ వినిపిస్తోంది అన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో సైలెంట్ గా ఉండడం బీజేపీకి మద్దతుగా మాట్లాడటం చేస్తున్నారు. ఇక ఇటీవల ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ. తెలంగాణ రాష్ట్రంలో నాయకత్వ లోపంతో కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందని ప్రస్తుతం ఉన్న పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీకి ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అంటూ వ్యాఖ్యానించారు.

అందుకే తాను బీజేపీలోకీ వెళ్లేందుకు సిద్ధమయ్యాను అంటూ చెప్పుకొచ్చారు మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ. సోనియాగాంధీ ఆశీర్వాదం తోనే తాను బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యాను అంటూ చెప్పుకొచ్చారు. కాగా ఇప్పటికే ఎంతోమంది కీలక నేతలు కాంగ్రెస్ పార్టీని వీడుతున్న నేపథ్యంలో సర్వే సత్యనారాయణ కూడా బీజేపీకి షాక్ ఇచ్చేందుకు సిద్ధం అయినట్లు ఆయన వ్యాఖ్యలతో స్పష్టంగా తెలుస్తోంది.