పులి వస్తుంటే గుంటనక్కలు పారిపోతాయి: బండి సంజయ్..

-

ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన రసవత్తరంగా మారింది..మొదటి నుంచి రాష్ట్రంలో బీజెపి వర్సెస్ తెరాస కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మోదీ మూడు రోజుల పర్యటన బీజెపికి బలాన్ని చేకూర్చింది.. ఈ రోజు ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణా బీజెపి నేత బండి సంజయ్ మాట్లాడుతూ.. మోదీ ప్రజల పట్ల వరాల వర్షం, ప్రజలను అభివృద్ధి పథంలో నడిపించాలని ఎంతో కృషి చేసారని ప్రశంసలు కురిపించారు.మోదీ పై తెరాస నేతలు విమర్శలు చూస్తే బాధగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.

బీజేపీ సంకల్ప సభలో పాల్గొన్న ఆయన మోదీని ఎందుకు తిడుతున్నారో టీఆర్ఎస్ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు.ప్రజలకు సేవ చేస్తున్నందుకా? వ్యాక్సిన్ ఉచితంగా ఇచ్చినందుకా? పేదలకు ఉచితంగా బియ్యం ఇస్తున్నందుకా? కష్టకాలంలో ఉక్రెయిన్ నుంచి విద్యార్థులను తీసుకోచ్చినందుకా? మోదీపై విమర్శలు చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు అంటూ ప్రశ్నలను సంధించారు బండి.. పులి వస్తే గుంటనక్కలు పారిపోతాయి..మోదీని అనే స్థాయి వాళ్ళకు లేదు ఇకపై విమర్శిస్తే ఊరుకోనేది లేదని హెచ్చరించారు..బండి సంజయ్ స్పీచ్ బీజెపి నేతల తో పాటు, జనాలను కూడా ఆకట్టుకుంది.. ఆ స్పీచ్ కు ఫిదా అయిన మోదీ బండి పై ప్రశంసలు కురిపించారు..

Read more RELATED
Recommended to you

Latest news