బిగ్ బ్రేకింగ్; సిఎంకి షాక్ ఇచ్చిన నలుగురు ఎమ్మెల్యేలు…!

-

మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ ప్రభుత్వానికి నలుగురు అసమ్మతి ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. నలుగురు ఎమ్మెల్యేలను బిజెపి హోటల్స్ కి తరలించినట్టు సమాచారం. 2018 లో జరిగిన ఎన్నికల్లో మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పుడు బోటా బోటీ గా వచ్చిన మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక అప్పటి నుంచి ప్రభుత్వ మనుగడపై అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.

మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో మొత్తం 230 సీట్లు ఉన్నాయి. 2018 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 114, భాజపా 107, స్వతంత్రులు 4, ఎస్పీ 1, బీఎస్పీ 2 స్థానాల్లో గెలుపొందాయి. మరో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సింది 116 సీట్లు. దీంతో ఎస్పీ, బీఎస్పీ, నలుగరు సంతంత్రులతో కలిసి కాంగ్రెస్‌ మొత్తం 121 మంది బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మరో ఇద్దరు ముగ్గురు గనుక షాక్ ఇస్తే మాత్రం ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.

ఒక్కో ఎమ్మెల్యేకు 45 కోట్ల వరకు బిజెపి ఆఫర్ చేసింది అని ప్రచారం జరుగుతుంది. అటు కాంగ్రెస్ నేతలు, ఇటు బిజెపి నేతలు ప్రభుత్వం విషయంలో వ్యూహాలు సిద్దం చేస్తున్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. ఎక్కడా బిజెపికి అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు ఆ పార్టీ సీనియర్ నేతలు కసరత్తులు చేస్తున్నారు. అయితే రాజకీయ పరిశీలకులు మాత్రం ఏ క్షణం అయినా ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news