ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిని మార్చాలి అని భావిస్తున్న ఏపీ ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలింది. అమరావతి ఉద్యమం అంతర్జాతీయ న్యాయస్థానానికి చేరింది. ఎన్నారైలు హేగ్ లోని అంతర్జాతీయ న్యాయస్థానానికి ఫిర్యాదు చేసారు. అమరావతి ఉద్యమంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలను అంతర్జాతీయ న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్ళారు. వీడియోలు, ఫోటోలతో సహా చూపించారట.
అమరావతిలో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతొందని హేగ్‍లోని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్‍లో అమెరికా ఎన్నారైల ఫిర్యాదు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. యూఎస్ ఎన్నారైల తరపున శ్రీనివాస్ కావేటి అనే ఎన్నారై ఒకరు ఫిర్యాదు చేసారు. ఫిర్యాదు స్వీకరిస్తున్నామని అక్‍నాలెడ్జ్ మెంట్ ప్రాసిక్యూటర్ ఇవ్వడం గమనార్హం. త్వరలో నిర్ణయం తీసుకున్నాక సమాచారం ఇస్తామని ప్రాసిక్యూటర్ చెప్పారు.
అంతర్జాతీయ కోర్టులో తమకు న్యాయం జరుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేసారు. అమరావతి రైతులకు మొదట్నుంచి మద్దతుగా ఉన్న ఎన్నారైలు ఈ నిర్ణయం తీసుకున్నారు. అమరావతి పరిరక్షణ సమితి ఎన్నారై విభాగం తరపున హేగ్ కోర్టులో ఫిర్యాదు చేసారు. అదే విధంగా త్వరలో జెనీవాలోని ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సంఘానికి కూడా అమరావతిలో మానవ హక్కుల ఉల్లంఘనపై ఫిర్యాదు చేయాలని ఎన్నారైలు నిర్ణయం తీసుకున్నారు.