చాలా దూకుడుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శాసన మండలి రద్దు విషయంలో వ్యవహరించడం జరిగింది. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి పునరుద్ధరించిన శాసనమండలి రద్దు బిల్లుకు ఇటీవల అసెంబ్లీలో ఆమోదం తెలపడంతో జగన్ సర్కార్ ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ప్రస్తుతం బిల్లు పార్లమెంటు సెక్రెటరీ లో ఉన్న ఈ బిల్లు త్వరలో కేంద్ర హోంశాఖకు ఆ తర్వాత లోక్సభకు అక్కడ ఆమోదం పొందితే రాజ్యసభకు వెళ్లే అవకాశం ఉంది.
అయితే కేంద్రంలో ఉన్న పెద్దలు కొంతమంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి రాజధాని అయితేనే విభజనతో నష్టపోయిన రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని చాలా బలంగా నమ్ముతున్నారాట. అంతేకాకుండా ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా 33 వేల ఎకరాలు రాజధాని కోసం రైతుల భూములు ఇవ్వటం తో శాసన మండలి రద్దు విషయంలో జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తే భూములు ఇచ్చిన రైతులు నష్టపోతారని కేంద్ర పెద్దలు ఆలోచిస్తున్నారట.
దీంతో ఈ విషయాన్ని హోల్డ్ లో పెట్టి శాసన మండలి రద్దు బిల్లు ముందు సభ లోకి వెళ్లకుండా మూడు నెలలు వేచి ఉండాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు వార్తలు తాజాగా ఢిల్లీ వర్గాల్లో వినబడుతున్నాయి. ఇదే గనుక నిజమైతే జగన్ కి ఝలక్ మొదలైనట్లే రాష్ట్ర వ్యాప్తంగా మూడో నెలలో అనేక రాజకీయ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. బీజేపీ డ్రామాతో రాష్ట్రంలో బిజెపి-జనసేన కూడా బలపడే అవకాశం ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.