కమలం గ్రాఫ్ డౌన్..ఆ నేతలతో రిస్క్.!

-

తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతుందా? అంటే ప్రస్తుతం రాజకీయాలని చూస్తే అవుననే చెప్పవచ్చు. ఎన్నికలు దగ్గరపడుతున బి‌జే‌పిలో ఊపు లేదు. ఏదో కేంద్ర పెద్దలు వస్తే సభలు పెట్టడం తప్ప..స్థానిక నేతలు రాజకీయ కార్యాచరణ రూపొందించి ముందుకెళ్లడంలో విఫలమవుతున్నారు. పైగా నేతల మధ్య సమన్వయం లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉన్నారు.

అయితే తెలంగాణలో బి‌జే‌పికి బలం ఉందా? అంటే 2019 పార్లమెంట్ ఎన్నికల ముందు వరకు ఆ పార్టీ బలం 5-6 శాతం ఓట్లు 2-3 సీట్లు అన్నట్లు ఉండేది.కానీ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు గెలిచి 20 శాతంపైనే ఓట్లు సాధించింది. తర్వాత నుంచి బి‌జే‌పిలో దూకుడు పెరిగింది. అధ్యక్షుడుగా బండి సంజయ్ వచ్చాక మరింతగా బలపడింది. ఈ తరుణంలో దుబ్బాక ఉపఎన్నికలో గెలవడం, జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో సత్తా చాటడం, కీలక నేతలు పార్టీలోకి రావడం, హుజూరాబాద్ లో గెలుపు ఇలా కొన్ని అంశాలు బి‌జే‌పిని బలపర్చాయి.

కానీ మునుగోడు ఉపఎన్నికలో ఓడిన దగ్గర నుంచి సీన్ మారిపోయింది. బి‌జే‌పిలో అంతర్గతంగా గ్రూపులు మొదలయ్యాయి. అదే సమయంలో బండి సంజయ్‌ని తప్పించి కిషన్ రెడ్డిని అధ్యక్షుడుగా పెట్టడంతో బి‌జే‌పి బలం మరింత తగ్గుతూ వచ్చింది. దానికి ముందు కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం, బి‌జే‌పి ఓటమితో తెలంగాణలో రాజకీయం మారింది. కాంగ్రెస్ పుంజుకుంది.

ఆ పార్టీలోకి బడా నేతలు రావడంతో కాంగ్రెస్ బలపడుతూ వచ్చింది. బి‌జే‌పి గ్రాఫ్ డౌన్ అవుతూ వస్తున్నారు. ప్రస్తుతం బి‌ఆర్‌ఎస్ లీడ్ లో ఉంది. దానికి దగ్గరలో కాంగ్రెస్ వస్తుంది. ఇంకా చాలా దూరంలో బి‌జే‌పి ఉంది. ప్రస్తుతం బి‌జే‌పి బలం 8-10 శాతంగా ఉందని తెలుస్తోంది. ఇక రానున్న రోజుల్లో కొందరు బడా నేతలు పార్టీ వీడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అదే జరిగితే బి‌జే‌పి గ్రాఫ్ ఇంకా డౌన్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news