బీజేపీలో కల్లోలం…రఘునందన్ కాన్ఫిడెన్స్ ఏంటి?

-

మొన్నటివరకు తెలంగాణలో బీజేపీనే అధికార టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయమని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా పీసీసీ పగ్గాలు రేవంత్ రెడ్డికి దక్కడంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారాయి. హఠాత్తుగా కాంగ్రెస్ కూడా రేసులోకి వచ్చేసింది. అలాగే ఆ పార్టీలోకి వలసలు మొదలవుతున్నాయి. బీజేపీ కంటే దూకుడుగా రేవంత్ రెడ్డి దూకుడుగా ముందుకెళుతున్నారు.

అధికార టీఆర్ఎస్‌ని టార్గెట్ చేసి రాజకీయ పరమైన విమర్శలు చేయడంలో ముందున్నారు. అలాగే ప్రజా సమస్యలపై పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు. ఈ విషయంలో బీజేపీ కాస్త వెనుకబడి ఉంది. ఇదే సమయంలో బీజేపీకి చెందిన నాయకులు కాంగ్రెస్, టీఆర్ఎస్‌లోకి వెళ్లడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే మోత్కుపల్లి నరసింహులు, పెద్దిరెడ్డిలు బీజేపీకి రాజీనామా చేశారు. త్వరలోనే వీరు టీఆర్ఎస్‌లోకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు.

అటు ఎర్రశేఖర్, గండ్ర సత్యనారాయణలు కాంగ్రెస్‌లోకి వెళ్ళేందుకు రెడీ అయ్యారు. మొన్నటివరకు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారని అంతా అనుకున్నారు. కానీ ఆయన కూడా ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. హుజూరాబాద్ ఉపఎన్నికలో ఈటల రాజేందర్‌కు మద్ధతు తెలిపినా కూడా, ఆ ఎన్నిక అయ్యాక కొండా కాంగ్రెస్‌లో చెరోచ్చని తెలుస్తోంది. అటు ఈటల లేకపోతే హుజూరాబాద్‌లో బీజేపీకి బలం లేదనే చెప్పొచ్చు. ఇలా బీజేపీపీలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్న సరే బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. ఇవన్నీ టీ కప్పులో తుఫాన్ లాంటివాని కొట్టిపారేస్తున్నారు. తెలంగాణలో బీజేపీ చాలా స్ట్రాంగ్‌గా ఉందని, హుజూరాబాద్ ఉపఎన్నిక తర్వాత ఆ విషయం రుజువు అవుతుందని అంటున్నారు. అయితే హుజూరాబాద్‌లో గెలిచిన అది ఈటల బలమే అని అందరికీ అర్ధమవుతుంది. మరి బీజేపీ బలం విషయంలో రఘునందన్‌ది కాన్ఫిడెన్స్ అవుతుందో ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news