బీజేపీలో ఓ వర్గం ఎమ్మెల్యే రాజాసింగ్ ని పక్కన పెట్టిందా ?

-

దుబ్బాక గెలిచిన ఊపుతో గ్రేటర్ ఎన్నికల్లోను సత్తా చాటాలని బీజేపీ ఆశ పడుతోంది… అందుకు కసరత్తు చేస్తోంది.. అయితే సీట్ల కేటాయింపు సందర్భంగా అక్కడక్కడా నిరసన లు జరిగాయి.. అయితే బీజేపీ నుంచి నగరంలో ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహారం గ్రేటర్ ఎన్నికల పై ఎలాంటి ప్రభావం చూపుతుంది…స్టార్ కంపెయినర్ గా ఉన్న ఆయన ప్రచారం లో పాల్గొంటారా.. ఇప్పుడు బీజేపీ నేతల్లో ఇదే చర్చ నడుస్తుంది.

 

బీజేపీ రాష్ట్ర నాయకత్వం పై రాజసింగ్ అలకబునారు… ఒక విదంగా తిరుగుబాటే చేసారు.. తనను మోసం చేశారు అని ప్రకటించారు రాజా సింగ్. సీట్ల కేటాయింపు పై అసంతృప్తి వ్యక్తం చేశారు… బీజేపీ పెద్దలు ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తున్నారని ఆరోపించారు.. తన కార్యకర్తకి సీటు ఇప్పించుకోలేక పోయానని ఆవేదన వ్యక్తం చేసారు.. కేంద్ర పార్టీ కి లేఖ రాస్తాను అని తెలిపారు..ఇక రాష్ట్ర కార్యాలయం తో పాటు లోకల్ ఆఫీసుల్లో కుర్చీలు ఇరిగాయి.. అద్దాలు పలిగాయి… బీజేపీ పెద్దలకి వ్యతిరేకంగా ఆందోళన లు జరిగాయి…

ఇప్పుడు రాజా సింగ్ నెక్స్ట్ ఏమి చేస్తాడు .. ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది.. బీజేపీ పెద్దలు ఆయన ను బుజ్జగిస్తారా లేక చర్యలకు పూనుకుంటారా అనే డిస్కస్ నడుస్తుంది..రాజా సింగ్ బీజేపీ నేతల బుజ్జగింపులకు లొంగుతారా.. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తారా అనే చర్చ బీజేపీ వర్గాల్లోనూ నడుస్తుంది.. చిన్న చిన్న సంఘటనలు మినహా అంతా సజావుగా జరుగుతుంది అనుకున్న సమయంలో రాజా సింగ్ ఎపిసోడ్ ఇబ్బంది కలిగించేదేననే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది..

టికెట్స్ ఆయన చెప్పిన వారికి కాకుండా ఇతరులకు ఇవ్వాలని అనుకుంటే ఆయన ను ఒప్పించాల్సి ఉండేది అని.. మా నేతలు ఒప్పుకున్న ఒప్పుకోకున్న రాజా సింగ్ ని అభిమానించే వారు రాష్ట్రంలో అన్ని చోట్ల ఉన్నారని గ్రేటర్ లోను ఆయన పార్టీ కి ఓట్లు వేయించగలరని బిజెపి కార్యకర్తలు అంటున్నారు.. ఆయన్ను ఒప్పించి ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా చేయాలని లేకుంటే ఎన్నికల్లో ప్రభావం పడుతుంది అని నేతలు అంటున్నారు…

తనకు అన్యాయం చేసిన నాయకులను పక్కన బెట్టి తన పార్టీ కోసం ఎన్నికల ప్రచారంలో రాజా సింగ్ పాల్గొంటారా చూడాలి.. జాతీయ పార్టీ ఈ విషయం పై ఎలా వ్యవహరిస్తుందో.. ఈ ఎన్నికల ఇంచార్జి గా ఉన్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్ ఈ ఎపిసోడ్ కి ఎలాంటి ఫుల్ స్టాప్ పెడుతాడో మరి..

Read more RELATED
Recommended to you

Latest news