ఎంపీ ర‌ఘురామ కోసం క‌దిలిన బీజేపీ.. ఆ విష‌యంలో స‌పోర్ట్‌!

ఏపీ వైసీపీ ఎంపీ ర‌ఘురామ అరెస్టుపై ఎన్నో ట్విస్టులు జ‌రుగుతూనే ఉన్నాయి. మొద‌ట కాళ్ల‌పై పోలీసులు కొట్టార‌ని, ఆ త‌ర్వాత ఎడిమా వ‌ల్ల వ‌చ్చాయని ఇలా ర‌క‌ర‌కాలుగా విచార‌ణ జ‌రిగింది. అయితే చివ‌ర‌కు సుప్రీంకోర్టు ఆయ‌న‌కు బెయిల్ ఇచ్చినా.. అందులోని ష‌ర‌తుల‌తో ఆయ‌న స‌త‌మ‌తం అవుతున్నారు. దీంతో ఆయ‌న ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిట‌ల్‌లో చేరారు.

ఇక్క‌డే అస‌లు ట్విస్టు నెల‌కొంది. ఎయిమ్స్ ఆస్ప‌త్రిని ఢిల్లీలోని కేజ్రీవాల్ సర్కార్ కొవిడ్ రోగుల కోసం వాడేసింది. కానీ కొవిడ్ రోగులను కాదని ఎంపీ రఘురామ ఆ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండడం విశేషంగా మారింది.

అదేంటి బ‌య‌టి పేషెంట్ల‌ను రానివ్వ‌న‌ప్పుడు ఎంపీ ర‌ఘురామ‌ను ఎలా చేర్చుకున్నార‌నే క‌దా మీ డౌటు. ఇక్క‌డే రాష్ట్ర బీజేపీ నేత‌ల విజ్ఞ‌ప్తితో కేంద్ర బీజేపీ పెద్ద‌లు రంగంలోకి దిగారు. రఘురామ ఎయిమ్స్ లో చేరడానికి వెళ్లేస‌రికే ఆ ఆస్పత్రి మొత్తం కొవిడ్ రోగులతో నిండిపోయింది. దీంతో కేంద్రఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ ఏకంగా ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియాకు ఫోన్ చేసి ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించారని తెలిసింది. వారి ఆదేశాల‌తోనే ఎయిమ్స్‌లో చికిత్స ఇస్తున్నారు. హైద‌రాబాద్ ఆర్మీ ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయితే పోలీసులు మ‌ళ్లీ ఏదో ఒక కేసులో ఇరికించేలా ఉన్నార‌ని ఎంపీ ఢిల్లీలోని ఎయిమ్స్‌కు వెళ్లారు.