పవన్ పరువు నిలబెట్టిన బీజేపీ ?

-

జనసేన పార్టీ పరిస్థితి గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏపీలో కాస్తో కూస్తో బలం బలగం ఉన్నా, తెలంగాణలో మాత్రం పరిస్థితి అంతంత మాత్రమే అనే పరిస్థితి తో పాటు, జనసైనికులు ప్రజలు అందరికీ తెలుసు. ఇదిలా ఉంటే , ఏపీలో రాజకీయంగా పై చేయి సాధించేందుకు ఎన్నోరకల ఎత్తుగడలు వేస్తూ , పార్టీ నాయకులను ఉత్సాహపరిచే విధంగా ప్రయత్నిస్తూనే వస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల తరువాత జనసేన పార్టీ పరిస్థితి ఏమిటో పవన్ కు అర్థం అయిపోయింది .  దీంతో పార్టీ ఇక పుంజుకునే అవకాశం లేదనే అభిప్రాయం తో జనసైనికులు పూర్తిగా నిరాశా నిస్పృహల్లో కి వెళ్ళిపోగా, ఎంతో మంది నాయకులు పార్టీని వీడి బయటకు వెళ్లిపోయారు.
ఇక ఆ తరువాత పవన్ బిజెపితో పొత్తు పెట్టుకుని ఆ పార్టీ సహకారంతో బలపడేందుకు ప్రయత్నించారు . అయితే మొదట్లో బిజెపితో పొత్తు పెట్టుకున్న జనసేన పట్టించుకోనట్టు వ్యవహరించడం , ఏపీకి సంబంధించిన విషయాలలో ఆయన సంప్రదించకుండానే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం, వంటి వ్యవహారాలు ఎన్నో జరగడం, ఒక దశలో బీజేపీతో పొత్తు తెగతెంపులు చేసుకునేందుకు సైతం పవన్ సిద్ధమయ్యారు అనే వార్తలు అప్పట్లో చాలానే వచ్చాయి. అయితే బీజేపీ తనను పెద్దగా పట్టించుకోవడం లేదని, తమ పార్టీని తక్కువగా అంచనా వేస్తోంది అనే కోపమో, భయపెట్టాలనే వ్యూహమో తెలియదు గాని,  బిజెపి కి ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండానే గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పవన్ ప్రకటన చేయడం, అభ్యర్థులను ఎంపికచేయడం, వారు నామినేషన్ వేయడం వంటి వ్యవహారాలు చోటు చేసుకున్నాయి.
అయితే ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే, ఫలితాలు తర్వాత ఆ పార్టీ పరిస్థితి ఏమిటనేది అందరికీ తెలిసేది. అయితే జనసేన, పవన్ కళ్యాణ్ పరువు పోకుండా బిజెపి అకస్మాత్తుగా అడ్డుపడింది. పోటీ అంటూ హడావుడి చేసి పరువు పోగొట్టుకునేందుకు సిద్ధమైన పవన్ ను బిజెపి నేతలు సకలం లో మరి పోటీ నుంచి విరమింప చేసేలా చేయడం వంటి వ్యవహారాలు ఎన్నో నడిచాయి. ఒకవేళ బీజేపీ జనసేన ను అలా వదిలి వేసి ఉంటే మళ్ళీ ఆయన పరువు పోగొట్టుకున్న వారు అనే అభిప్రాయాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పుణ్యానికి జనసేన ను బాగానే  కాపాడారు అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
-Suman

Read more RELATED
Recommended to you

Latest news