సుజనా కనపడకుండా టీడీపీని ముంచుతున్నారా…?

Join Our Community
follow manalokam on social media

తెలుగుదేశం పార్టీకి కొంత మంది వలన ఎక్కువగా నష్టం జరుగుతుంది. బిజెపి రాజ్యసభ ఎంపీ సుజనాచౌదరితో తెలుగుదేశం పార్టీకి ఎక్కువ నష్టం జరుగుతుందనే ఆవేదన కొంతమంది ఎక్కువగా వ్యక్తం చేస్తున్నారు. టిడిపి నేతలతో ఆయన ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ రావడంతో టిడిపి నేతలు కూడా ఆయన విషయంలో కాస్త ఎక్కువగానే ఇబ్బంది పడుతున్నారని టిడిపి వర్గాలు అంటున్నాయి.

కృష్ణా జిల్లాకు చెందిన కమ్మ సామాజిక వర్గం నేతలతో ఆయన చర్చలు జరిపారని విజయవాడ వర్గ విభేదాలతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్న ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన కీలక నేతతో చర్చలు జరిపి పార్టీ లోకి రావాల్సిందిగా ఆహ్వానించారు అని అంటున్నారు. మీరు పార్టీలోకి వస్తే మీకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగిస్తామని కూడా సదరు నేతకు హామీ ఇచ్చినట్టుగా మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

విజయవాడలో ఉన్న వర్గ విభేదాలను సుజనాచౌదరి క్యాష్ చేసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీని ద్వారా బీజేపీ అధిష్టానం వద్ద మంచి మార్కులు కొట్టేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన తన సన్నిహితులతో కూడా చర్చలు జరిపారని అయితే పార్టీలోకి రావడానికి సదరు కమ్మ సామాజిక వర్గం అంతగా ఆసక్తి చూపించలేదు అని తెలుస్తుంది. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. అటు రాయలసీమ జిల్లాల్లో ఉన్న కొంత మంది నేతలతో కూడా ఎక్కువగా చర్చలు జరుపుతున్నారు.

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...