ఎర్రబెల్లితో బీజేపీ బలం పెరగనుందా?

తెలంగాణ బీజేపీలోకి వలసలు ఊపందుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈటల రాజేందర్…శ్రావణ మాసంలో బీజేపీలోకి వలసలు మొదలవుతున్నాయని చెప్పారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు వలసలు మొదలు కానున్నాయి. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..బీజేపీలో చేరిక ఖాయమైంది. ఇదే క్రమంలో టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇస్తూ…మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సోదరుడు ప్రదీప్ రావు బీజేపీలో చేరనున్నారు.

ఎన్నో ఏళ్ల నుంచి టీఆర్ఎస్ లో పనిచేస్తూ వస్తున్న ప్రదీప్ రావుకు..ఆ పార్టీలో పెద్దగా ప్రాధాన్యత ఉండటం లేదు. ఎర్రబెల్లి దయాకర్ టీడీపీలో ఉండగానే…ప్రదీప్ రావు 2009లో ప్రజారాజ్యంలోకి వెళ్ళి..ఆ పార్టీ తరుపున వరంగల్ తూర్పులో పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత టీఆర్ఎస్ లోకి వచ్చి తూర్పు టికెట్ ఆశించారు…నామినేషన్ కూడా వేశారు…కానీ కేసీఆర్ చెప్పడంతో నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు.

2018 ఎన్నికల్లో కూడా అదే సీన్..ఎన్నికల్లో నన్నపనేని నరేందర్ విజయం కోసం పనిచేయాల్సి వచ్చింది. అయితే నరేందర్..ప్రదీప్ వర్గానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అలాగే టీఆర్ఎస్ లో ప్రదీప్ కు సరైన గుర్తింపు కూడా ఉండటం లేదు. దీంతో ఆయన పార్టీ మారాలని డిసైడ్ అయ్యారు. ఈ నెల 7న కోమటిరెడ్డితో పాటే ప్రదీప్ సైతం బీజేపీలో చేరతారని తెలుస్తోంది. అయితే ప్రదీప్ చేరిక వల్ల బీజేపీకి బలం పెరుగుతుందని చెప్పొచ్చు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీజేపీకి పెద్ద బలం లేదు.

ప్రదీప్ చేరికతో వరంగల్ తూర్పులో బీజేపీ బలం పెరగనుంది. ఇప్పటికే అక్కడ గంటా రవికుమార్ నాయకత్వంలో బీజేపీ దూసుకెళుతుంది. ప్రదీప్ కూడా వస్తే తూర్పులో బీజేపీ విజయం వైపు వెళుతుంది. కానీ ప్రదీప్ కూడా వస్తుండటంతో సీటు విషయంలో కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పటికే రవికుమార్ సీటు కోసం ట్రై చేస్తున్నారు. మరి ఇలాంటి తరుణంలో వరంగల్ ఈస్ట్ సీటు ప్రదీప్ కు ఇస్తారా? లేక రవికుమార్ కు ఇస్తారా? అనేది క్లారిటీ లేదు. మొత్తానికైతే ప్రదీప్ రాక బీజేపీకి ప్లస్సే.