రెండేళ్లలో ధరలు రెండు రెట్లు పెరిగాయి : మార్గాని భరత్‌

-

వర్షాకాలం పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బిల్లులుపై ప్రతిపక్ష ఎంపీలు గగ్గోలు పెడుతున్నారు. ప్రజలపై పెనుభారం మోపవద్దంటూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే.. తాజాగా.. దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, కేంద్రం దదిద్దుబాటు చర్యలు చేపట్టాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ రెండేళ్లలో ధరలు రెండు రెట్లు పెరిగాయి. దిగుమతులు పెరిగిపోవడం వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. జీడీపీ తొమ్మిది నుంచి ఏడు శాతానికి పడిపోయింది.

YSRCP MP Sri Margani Bharat press meet from party central office -  Tadepalli - YouTube

చమురు దిగుమతి వల్ల ఎకానమీపై భారం పెరిగింది. అందుకే.. ప్రత్యామ్నాయ ఇంధన వనరులు అందుబాటులో తేవాల్సిన అవసరం ఉందన్నారు మార్గాని భరత్. ఈ సమయంలో సోలార్ ఎనర్జీ విషయంలో కేంద్ర తీరు సరికాదన్నారు మార్గాని భరత్‌. నదుల అనుసంధానంతో కరెంట్ ఉత్పత్తి పెంచే అవకాశం ఉంది. వంట గ్యాస్ ధరలు తగ్గించాలి.పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవాలి. ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల పామాయిల్ రెట్లు పెరిగాయి. కానీ వాటి ధరలు తగ్గించే చర్యలు తీసుకోవాలి. తిరుమల తిరుపతిపై జీఎస్టీ రద్దు చేయాలి. హిందువుల మనోభావాలు కాపాడాలని కేంద్రాన్ని కోరారు మార్గాని భరత్.

 

Read more RELATED
Recommended to you

Latest news