ఆయన్ను బిజెపి టార్గెట్ చేసినా… లైట్ తీసుకున్న కెసిఆర్…?

-

తెలంగాణాలో భారతీయ జనతా పార్టీ బలపడాలని చూస్తుందనే విషయం ఎప్పటి నుంచో అర్ధమవుతుంది. దక్షిణాదిలో ఆ పార్టీకి కాస్త బలం ఉన్న రాష్ట్రం కూడా తెలంగాణా. ఉత్తరాది ప్రభావం ఎక్కువగా ఉండటంతో భారతీయ జనతా పార్టీ తెలంగాణాలో కాషాయ జెండాను ఎగురవేయ్యాలని ధీమాగా ఉన్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికల్లో అంచనాలు లేకుండా నాలుగు ఎంపీ స్థానాలు కైవసం చేసుకున్న తర్వాత తెరాస నెత్తిన కూర్చుంది ఆ పార్టీ. ఇక ఇప్పుడు తెరాస లో కీలక నేతలను తన వైపుకి తిప్పుకునే ప్రయత్నాలు చేస్తుంది.

ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో బలమైన నేతలకు ఆ పార్టీ నేతలు గాలం వేసారు. ఈ నేపధ్యంలోనే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కి గాలం వేసారని ప్రచారం జరుగుతుంది. రెండు నెలల క్రితం పార్టీ మారిన రాజ్యసభ ఎంపీ గరికపాటి మోహనరావుకి ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. దీనితో ఆయన ద్వారా తుమ్మలను బిజెపిలోకి తీసుకొచ్చి కీలక పదవి అప్పగించాలని బిజెపి భావిస్తుంది. హైదరాబాద్ లో ఉన్న తుమ్మల నివాసంలో గరికపాటి కలిసారు కూడా… పార్టీలోకి రావాలని ఆహ్వానించారు.

తుమ్మల సమయం కావాలని కోరినట్టు తెలుస్తుంది. ఈ విషయం ముఖ్యమంత్రి కెసిఆర్ కి తెలిసినా సరే ఆయన లైట్ తీసుకున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఖమ్మం నుంచి నామా ఎంపీగా ఉన్నారు… ఆయనకు బలమైన వర్గం ఉంది. దానికి తోడు పొంగులేటి కూడా బలమైన నేతగా ఉన్నారు… దీనితో తుమ్మల విషయంలో కెసిఆర్ లైట్ తీసుకున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. జిల్లాల్లో ఉన్న తుమ్మల వర్గానికి కూడా ప్రాధాన్యత తగ్గిందనే వార్తలు ఎక్కువగా వినపడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news