తిరుపతి పార్లమెంటు పరిధిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారా లేదా అనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. ఆయన ప్రచారంలో ముందు ఉత్సాహంగా పాల్గొన్న సరే తర్వాత వెనక్కి తగ్గారు. ఇప్పుడు వెళ్లి సినిమా షూటింగ్ లలో ఎక్కువగా పాల్గొంటున్నారు. అయితే కరోనాతో క్వారంటైన్ లో ఉన్నారు. అయితే ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ ప్రచారం చేయాలని బీజేపీ నేతలు ఆయన మీద కాస్త గట్టిగానే ఒత్తిడి తెచ్చే అవకాశం ఉండవచ్చని సమాచారం.
బిజెపిలో అగ్ర నాయకులు కొంతమంది ఆయనతో మాట్లాడుతున్నారు. తిరుపతి లో పవన్ కళ్యాణ్ కనీసం మూడు రోజులు ప్రచారం చేయాల్సిన అవసరం ఉంటుందని కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే కొన్ని కొన్ని ఫలితాలు ఉండవచ్చు అని అంటున్నారు. తమిళనాడు ప్రాంతానికి చెందిన కొంతమంది ఇప్పుడు బిజెపికి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
కాబట్టి ఈ నష్టాన్ని పూడ్చుకోవాలి అంటే పవన్ కళ్యాణ్ రావాల్సిన అవసరం ఉంది అని కొంత మంది కోరుతున్నారు. అయితే పవన్ క్వారంటైన్ లో ఉన్నారు కాబట్టి మీడియా ద్వారా ప్రచారం నిర్వహించాలని కోరుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఏ విధంగా స్పందిస్తారు ఏంటి అనేది ఇంకా స్పష్టత రావడం లేదు. ఇక పవన్ కళ్యాణ్ కు బీజేపీ రాష్ట్ర నాయకులకు ఈ మధ్యకాలంలో సఖ్యత లేకపోవడంతో ఆయన ప్రచారం విషయంలో కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదని రాజకీయ వర్గాలు అంటున్నాయి.