ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. నెల రోజుల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చెయ్యాలని జగన్ ఆదేశించారు. రిజర్వేషన్లు తగ్గించాలని ఏపీ హైకోర్ట్ సూచించిన నేపధ్యంలో జగన్ మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రిజర్వేషన్లు తగ్గించడానికి నిర్ణయం తీసుకున్నారు. దీనిపై వారం రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కానుంది.
ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను నెల రోజుల్లో పూర్తి చెయ్యాలని అధికారులను ఆయన ఆదేశించారు. హైకోర్ట్ కూడా ఇదే విషయం చెప్పింది అన్నారు. పంచాయితీ రాజ్ చట్టంలో సవరణల కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చామని అన్నారు. డబ్బు లిక్కర్ ని నిరోధించడానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చామని అన్నారు. డబ్బు లిక్కర్ దొరికితే అనర్హత వేటు వెయ్యాలని జగన్ ఆదేశించారు. పోలీసులు చాలా ధృడంగా ఉండాలని అన్నారు.
డబ్బు లిక్కర్ పంచారు అనే మాట రాకూడదు అని స్పష్టం చేసారు. మన రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ దేశంలోనే ఆదర్శంగా నిలవాలి అని ఆదేశించారు జగన్. దీనితో ఇప్పుడు విపక్షాలకు షాక్ తగిలింది. రాష్ట్రంలో జగన్ సర్కార్ పై వ్యతిరేకత ఉందని ప్రచారం చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జగన్ ఎన్నికలకు వెళ్ళాలి అంటే భయపడే పరిస్థితి ఏర్పడింది అంటూ ఆరోపించారు. ఇప్పుడు ఆయన నిర్ణయంతో బాబుకి షాక్ తగిలింది.