బ్రేకింగ్; జగన్, విజయసాయికి అదిరిపోయే గుడ్ న్యూస్…!

2361

సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ (జేడీ)గా ఐపీఎస్‌ అధికారి మనోజ్‌ శశిధర్‌ నియమితులయ్యారు. ఆయన 1994 గుజరాత్‌ కేడర్‌ అధికారి. మనోజ్‌ శశిధర్‌ ఐదేళ్లపాటు సీబీఐలో కొనసాగనున్నారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉంటే ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధం లేని,

వ్యక్తిని సిబిఐ జేడీగా నియమించవద్దని కోరారు. మాజీ జేడీ లక్ష్మీ నారాయణ, తెలుగుదేశం అధినేత చంద్రబాబుకి అనుకూలంగా పని చేసారని, విచారణలో కూడా వాళ్ళకు సహకరించారని విజయసాయి రెడ్డి కేంద్రానికి తెలిపారు. ఈ నేపధ్యంలోనే తెలుగు రాష్ట్రాలకు సంబంధం లేని వ్యక్తి నియమించాలని, కర్నాటకకు చెందిన ఒక అధికారి రావాలని చూస్తున్నారని విజయసాయి అమిత్ శాకు తెలిపారు.

వెంటనే స్పందించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖకు ఆదేశాలు ఇచ్చారు. ఆయన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవాలని అమిత్ షా ఆదేశించారు. ఈ నేపధ్యంలో గుజరాత్ క్యాడర్ కి చెందిన అధికారిని నియమిస్తూ ఉత్తర్వులు జారి చేసారు. కాగా జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. నేడు కోర్ట్ కి విజయసాయి రెడ్డి సహా పలువురు నిందితులు హాజరయ్యారు.