తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు ముఖ్యమంత్రి జగన్ షాక్ ఇచ్చారు. వై కేటగిరిగా ఉన్న లోకేష్ భద్రతను జగన్ ఎక్స్ కి తగ్గించడం ఇప్పుడు చర్చనీయంశంగా మారింది. ఎన్నికల్లో ఓటమి తర్వాత దూకుడుగా వ్యవహరిస్తున్న లోకేష్ ని కట్టడి చేసేందుకు గాను జగన్ భద్రతను తగ్గించారనే ఆరోపణలు తెలుగుదేశం చేస్తుంది. మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి వుందనే నిఘా వర్గాలు హెచ్చరించాయి.
ఈ నేపధ్యంలో చంద్రబాబునాయుడు తనయుడు లోకేశ్ కి 2014 కు ముందు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2+2 భద్రత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అనంతరం 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత లోకేశ్ భద్రతని 4+4 కి పెంచారు. 2016లో ఎవోబీలో మావోయిస్ట్ లను అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్కౌంటర్ చేసింది. ఆ తర్వాత అప్పటి టీడీపీ ప్రభుత్వం జెడ్ కేటగిరికి లోకేష్ భద్రతను పెంచింది.
ఆ తర్వాత మంత్రి కావడంతో ఆయన భద్రత విషయంలో అప్పటి ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంది. జగన్ సర్కార్ వచ్చిన తర్వాత జెడ్ క్యాటగిరి నుండి వై ప్లస్ కి తగ్గించి, ప్రస్తుతం ఎక్స్ కేటగిరీ మార్పు చేస్తూ భద్రతను పూర్తిగా కుదించారు. 8 నెలల్లోనే రెండు సార్లు లోకేశ్ భద్రతను కుదించింది. ఇప్పుడు ఆయన భద్రతను మరింతగా తగ్గించింది. దీనిపై తెలుగుదేశం నేతల్లో ఆందోళన వ్యక్తమవుతుంది.