ఆంధ్రప్రదేశ్ లో కాబోయే మంత్రులు ఎవరు అనేదానిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇటీవల పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు వెళ్లడంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఎవరిని కేబినెట్లోకి తీసుకుంటారు అనే దానిపై పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి. నగిరి ఎమ్మెల్యే ఆర్ కే రోజా ను క్యాబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. అయితే ఆమెపై నియోజకవర్గంలో సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత ఉంది. ఇలాంటి తరుణంలో జగన్ వద్దని భావించారట.
దీంతో గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే విడుదల రజిని కేబినెట్లోకి తీసుకునే సూచనలు ఉన్నాయని అంటున్నారు. అదేవిధంగా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లేదా గురజాల నుంచి గెలిచిన కాసు మహేష్ రెడ్డి ని కేబినెట్లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతోంది. అయితే మంత్రిగా తనకు అవకాశం ఇవ్వాలని విడుదల రజిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఇప్పటికే కోరారట. అయితే ఆమెకు నరసరావుపేట నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన లావు కృష్ణదేవరాయలు తో విభేదాలు ఉన్నాయి.
కాబట్టి ఆమెను పక్కన పెట్టాలని గుంటూరు జిల్లా నేతలు సూచించారట. ఎమ్మెల్యే పదవి లో ఉన్న ఆమె దూకుడుగా ఉన్నారని కాబట్టి మంత్రి పదవి ఇస్తే ఆమెను కట్టడి చేయడం మీ వల్ల కూడా కాదని జగన్ కి గుంటూరు జిల్లా నేతలకు సూచించినట్టు సమాచారం. దీంతో ఈ విషయంలో జగన్ వెనక్కి తగ్గారు. కృష్ణాజిల్లా, తిరువూరు నియోజకవర్గం నుంచి గెలిచిన కొక్కిలిగడ్డ రక్షణ నిధి క్యాబినెట్లో తీసుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఆయన తిరువూరు నుంచి వరుసగా రెండు సార్లు విజయం సాధించారు.