బ్రేకింగ్; ఆయనకు రాజ్యసభ సీటు ఖాయం చేసిన జగన్…!

-

ఆంధ్రప్రదేశ్ నుంచి పరిమల్ నత్వానికి రాజ్యసభ సీటు ఖరారు అయినట్టేనా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ఇటీవల ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబాని తో కలిసి నత్వాని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని కలిసారు. ఈ సందర్భంగా జగన్ ని అంబాని నత్వానికి రాజ్యసభ సీటు ఇవ్వాలని కోరినట్టు ప్రచారం జరుగుతుంది. దీనితో అసలు నత్వాని ఎవరు అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది.

వివరాల్లోకి వెళితే ఈయన 1990 లో పారిశ్రామిక వేత్తగా ఉన్నారు. 1997లో రిలయన్స్ సంస్థలో చేరారు. 2016 నాటికి ఇండస్ట్రీ కార్పొరేట్ అఫైర్స్ గ్రూప్స్ ప్రెసిడెంట్ గా ఏదిగారు. ధీరూ భాయ్ అంబానీతోనూ నత్వాని కలసి పని చేశారు. రాజకీయంగా కూడా ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయనకు కాంగ్రెస్ పార్టీ తో పాటుగా బిజెపి తోను సత్సంబంధాలు ఉన్నాయి.

బిజెపి నాయకులకు, ముఖేశ్ కు మద్య రాయబారిగా కూడా వ్యవహరిస్తారని అంటూ ఉంటారు. వ్యాపారల్లోనే కాదు ప్రజాసేవ లో కూడా ఎంపీ గారు కాస్త ఒక అడుగు ముందుకి వేసారు. ఈయన రాజకీయ ప్రస్థానం తొలిసారి 2008 లో జార్ఖండ్ నుంచి మొదలైంది. తొలిసారి అదే ఏడాది ఆ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2014లోకూడా ఇక్కడే రాజ్య సభకు పదవి దక్కించుకున్నారు.

ఈ నేపథ్యంలోనే నత్వాని మీడియాతో మాట్లాడుతూ సోమవారం కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపి నుంచి రాజ్య సభ సీటు కోసం అంబానీతో కలిసి జగన్ ని కలిసినట్లు వెల్లడించారు. దాదాపు సీటు ఖాయమైనట్లే అని ఆయన సోమవారం పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో మీడియా చిట్ చాట్ లో అన్నారు. స్వయంగా అంబానీ వచ్చి జగన్ నీ సీటు గురించి అడగటం దానికి ముఖ్య మంత్రి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఢిల్లీలో అమిత్ షాని కలసినప్పుడు నత్వానీ కి సీటు ఇవ్వాలని సూచించినట్లు తెలుస్తుంది. ఒకవేళ సీటు దొరక్కపోతే ప్రత్యామ్నాయం గా జార్ఖండ్,ఒడిస్సా ,బీహార్ లను ఆప్షన్ గా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. దీనితో వైసీపీ నేత ల్లో ఆందోళన మొదలైంది. ఏకంగా అంబానీ నే వచ్చి సీటు కోసం జగన్ నీ కలవటంతో ఇప్పుడు దీనిపై రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news