చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ కోటరీ కడప జిల్లాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆ టైంలో మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాస్ చక్రం తిప్పి టిడిపి జెండా కడప జిల్లాలో ఎగరేశారు. ఇదే తరుణంలో చాలా సందర్భాలలో ప్రతిపక్షంలో ఉన్న వైయస్ జగన్ ని ఆయన ఎత్తుగడలను గంటా శ్రీనివాస్ చిత్తు చేశారు. అయితే ప్రస్తుతం వైఎస్ జగన్ అధికారంలో ఉన్న తరుణంలో భీమిలి ఎమ్మెల్యేగా గెలిచిన గంటా శ్రీనివాస్…తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో కి వచ్చేస్తారు అని అప్పట్లో వార్తలు వచ్చాయి.
మళ్లీ అదే సమయంలో బిజెపి పార్టీలోకి వెళ్తున్నట్లు వార్తలు రావడం జరిగాయి. అయితే తనపై వచ్చిన వార్తలకు చెక్ పెడుతూ… ఇటీవల బిజెపి పార్టీకి చెందిన కార్యకర్తలను తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ చేసుకున్నారు. ఇదే సమయంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుగు ఉండదని ఆ సమయంలో గంట శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు చేసి వారం రోజులు గడవక ముందే గంటకి కొంప మునిగే లాంటి న్యూస్ జగన్ పంపించారు. వాస్తవంగా భీమిలి నియోజకవర్గంలో అనగా గంటా శ్రీనివాసరావు నియోజకవర్గం లో నమ్ముకున్న పార్టీ కార్యకర్తలు కింది స్థాయి నేతలు ఎవరు కూడా ఇతర పార్టీలోకి వెళ్లరు.
అటువంటిది వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో టిడిపి పార్టీకి పార్టీకి విశాఖలో తిరుగుండదని, అంతా సవ్యంగా జరుగుతుందిలే అనుకున్న టైం లో విశాఖలోని గంటా నియోజక వర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పచ్చ కండువా ను పక్కన పెట్టి వైకాపా కండువా కప్పుకున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కింది స్థాయి నేతలు సడెన్ గా ప్లేట్ ఫిరాయించి వైకాపాలో జాయిన్ కావడంతో ఈ న్యూస్ తెలుసుకొని గంటా శ్రీనివాసరావు తన నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తల చేత సమావేశం నిర్వహించి ఎవరు వెళ్ళిపోకుండా ముందు జాగ్రత్తలు ప్రస్తుతం తీసుకుంటున్నారు.