బ్రేకింగ్; వైసీపీ ఎమ్మెల్యేకి షాక్…!

-

73 రోజు కు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైతుల దీక్ష చేరింది. అయినా ప్రభుత్వం దిగిరావడం లేదు. మందడం,తుళ్లూరు సహా 29 గ్రామాల ప్రజలు 73 రోజులుగా ధర్నాలు చేసినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదు అని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీక్షా శిభిరానికి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి వెళ్ళారు. మంచి వ్యక్తి అని నమ్మి ఓట్లేసిన మా ప్రజా ప్రతినిధి కూడా మాకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని వాపోతున్నారు.

అమరావతి కాకుండా విశాఖను రాజధానిగా కావాలని అడగటం ఏమిటని వారు మండిపడుతున్నారు. ఇది ప్రజాస్వామ్య పాలనేనా లేక రాక్షసపాలనా అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. ఉత్తరాంధ్రా కి అన్యాయం జరిగింది అని అంటున్నారు మరి మాగురించి పట్టదా అని నిలదీశారు. ఇక్కడ ఎంత మంది పిల్లలు, పెద్దలు, మహిళలు,పురుషులు అని తేడా లేకుండా ధర్నా లో పాల్గొంటున్నారని…

ఎంత మంది ప్రాణాలు కోల్పోయారనేది , ప్రభుత్వం పట్టించుకోవడం లేదు సరి కదా మా మీద అక్రమం గా ఇక్కడ లేని వారి మీద కూడా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఇది మంచి ప్రవర్తన కాదన్నారు. దీక్షా శిబిరం వద్దకు వెళ్ళి న మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కి నిరసన సెగ తగిలింది. ఇప్పటికైనా మా గురించి ఆలచించవలసిన ది గా కోరుతున్నామని రైతులు ఆయన్ను నిలదీశారు. అప్పటివరకు రాజధాని రైతులు శాంతి యుతంగా దీక్షలు చేస్తారని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news