కారులో కన్ఫ్యూజన్.. కేసీఆర్ వ్యూహం మారుస్తారా?

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి? ఇప్పుడు ఇదే పెద్ద చర్చ. మామూలుగా షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే నవంబర్ చివరిలో లేదా డిసెంబర్ మొదట వారంలో ఎన్నికలు జరుగుతాయి. అందుకే ముందుగానే కే‌సి‌ఆర్..అభ్యర్ధులని కూడా ప్రకటించేశారు. మరి ఇప్పుడు పరిస్తితులు చూస్తుంటే షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగేలా ఉన్నాయా? అంటే అదే క్లారిటీ రావడం లేదు. ఇప్పటికే కేంద్రం జమిలి ఎన్నికలపై చర్చ మొదలుపెట్టింది.

కానీ జమిలి ఎన్నికలు జరగడం అనేది పెద్ద టాస్క్. అది ఇప్పుడే వర్కౌట్ అయ్యే అవకాశం లేదు. అదే సమయంలో జమిలి ఎన్నికలు కాకపోయినా ఎలాగో 2024 ఏప్రిలో లో లోక్ సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రాలతో పాటు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలని సైతం లోక్ సభ ఎన్నికలతో పాటే నిర్వహించేలా కేంద్రం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

సాధారణంగా లోక్ సభ ఎన్నికల తో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే బి‌జే‌పికి అడ్వాంటేజ్ ఉంటుంది. అలా కాకుండా ముందే అసెంబ్లీ ఎన్నికలు జరిగితే బి‌జే‌పికి కాస్త నష్టం. ఇప్పుడు బి‌జే‌పి మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌ఘడ్, మిజోరాం, తెలంగాణ రాష్ట్రాలపై ఆశలు పెట్టుకుంది. సెమీ ఫైనల్స్ గా భావించే ఈ రాష్ట్రాల్లో బి‌జే‌పికి పరిస్తితులు తారుమారు అయితే..ఆ ప్రభావం పార్లమెంట్ ఎన్నికలపై పడే అవకాశం ఉంది. దీంతో బి‌జే‌పికి నష్టం ఉంటుంది.

అలా కాకుండా ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా లోక్ సభ ఎన్నికలతో పాటే నిర్వహించాలని బి‌జే‌పి ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. అదే జరిగితే తెలంగాణలో కే‌సి‌ఆర్ ముందుగానే అభ్యర్ధులని ప్రకటించడం అనేది రాంగ్ స్టెప్ అవుతుంది. ఇప్పటికే అభ్యర్ధులని ప్రకటించిన పూర్తి స్థాయిలో ప్రచారం మొదలు కాలేదు. పైగా అసంతృప్తులతో తలనొప్పి వచ్చి పడింది. మరి ఇలాంటి తరుణంలో కే‌సి‌ఆర్ వ్యూహం మార్చి ఎలా ముందుకెళ్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news