ఆ విష‌యంపై బండి సంజ‌య్ మౌనం.. స్పీడు త‌గ్గిందా?

బండి సంజ‌య్ అంటే తెలంగాణ రాజ‌కీయాల్లో ఒక ఫైర్ బ్రాండ్‌. ఆయ‌న మాట‌లుతూటాల్లా పేలుతుంటాయి. ఆయ‌న మాస్ స్పీచ్‌కు ల‌క్ష‌ల మంది అభిమానులు కూడా ఉన్నారు. ప్ర‌తి విష‌యంపై చాలా గ‌ట్టిగా స్పందింస్తుంటారు. ఏ చిన్న అవ‌కాశం వ‌చ్చినా.. టీఆర్ ఎస్‌ను ఉతికి ఆరేస్తుంటారు. అలాంటి వ్య‌క్తి గ‌త‌కొద్ది కాలంగా సైలెంట్‌గా ఉంటున్న‌ట్టు క‌నిపిస్తున్నారు.

నిజానికి క‌రోనా సెకండ్ వేవ్ కు కాస్త ముందు చూస్తే.. నిత్యం కేసీఆర్.. కేటీఆర్ పై ఏదో ఒక తీవ్ర వ్యాఖ్య చేస్తూ త‌న మార్కు చూపించేవారు. అలాంటి ఆయన కొద్దిరోజులుగా సంచలన వ్యాఖ్యలు, లేదా గ‌ట్టి కౌంట‌ర్‌లే వేయ‌క‌పోవ‌డం ఇక్క‌డ‌గమనార్హం.

ఒక‌ప్పుడు ఆయుష్మాన్ భార‌త్‌ను తిట్టిన కేసీఆర్‌.. ఇప్పుడు తెలంగాణలో అమలు చేస్తామన్న‌ప్పుడు బండి సంజ‌య్ కేసీఆర్‌ను ఉతికి ఆరేసే ఛాన్స్ మిస్‌చేసుకున్నాడు. ఇంకో విష‌యం ఏంటంటే.. ఆయుష్మాన్ భార‌త్‌ను అమ‌లు చేస్తామ‌న్న కేసీఆర్ ఇప్ప‌టి వ‌ర‌క జీవో జారీ చేయ‌లేదు. క‌నీసం దీనిపై కూడా బండి మాట్లాడ‌ట్లేదు. ఇలాంటి అవ‌కాశాలు వ‌చ్చిన‌ప్పుడే ప్ర‌తిప‌క్షా పాత్ర అంటే ప్ర‌జ‌ల‌కు చూపించాలి. కానీ ఆ చాన్స్ బండి మిస్ చేసుకున్నాడు.