మొదటి దశ పోలింగ్ రోజు ఎన్ని ఘోరాలు జరిగాయో చూశాం.. మరి ఈ రోజు రెండో విడత పోలింగ్ స్టార్ట్ అయ్యింది. ఇందులో భాగంగా ఉత్తర్ ప్రదేశ్‌లోన జరుగుతున్న పోలింగ్ సజావుగా సాగట్లేదని, కొన్ని నియోజక వర్గాల్లో అనర్హులు ఓట్లు వేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అమ్రోహ లోక్ సభలో అనర్హులు కొంతమంది పురుషులు బుర్ఖాలు దరించి దొంగ ఓట్లు వేస్తున్నారని బీజేపీ లోక్ సభ అభ్యర్థి కన్వర్ సింగ్ ఆరోపించారు. బుర్ఖాలు వేసుకున్న మహిళలను తనిఖీ చేయకుండానే పోలింగ్ బూతుల్లోనికి అనుమతిస్తుండటం అలుసుగా తీసుకుంటున్నారని తెలిపారు. పురుషులు బుర్ఖాలు వేసుకోని ఓట్లు వేస్తున్నట్లు సాక్ష్యాలు కూడా ఉన్నాయని, తమ పార్టీ కార్యకర్తలు ప్రత్యక్షంగా చూశారని కన్వర్ తెలిపారు. ముఖం కప్పుకొని రావడం వల్ల నిజమైన ఓటర్లా? కాదా? అనే విషయాన్ని పోలింగ్ సిబ్బంది తేల్చుకోలేక పోతున్నారని చెప్పారు.
అయితే కన్వర్ చేసిన ఆరోపణలు అవాస్తవాలంటూ మహాకూటమి అభ్యర్థి డానిష్ అలీ స్పందించారు. ఓటమి భయంతోనే కన్వర్ సింగ్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని, కన్వర్ ఆరోపించినట్లు ఏమీ జరగడం లేదని తెలిపారు. ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్‌ను చెడగొట్టే విధంగా కన్వర్ మాట్లాడుతున్నారని, పోలింగ్ శాతాన్ని తగ్గించడానికి ఆయన కట్టుకథలు అల్లుతున్నారని ఆరోపించారు.
ఈ ఆరోపణలను మహాకూటమి అభ్యర్థి డానిష్ అలీ తోసిపుచ్చారు. ఇలాంటి ఘటనలేవీ చోటు చేసుకోవట్లేదని అన్నారు. ఓటమి భయంతోనే కన్వర్ సింగ్ ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేలా చేస్తున్నారని, పోలింగ్ శాతాన్ని తగ్గించడానికి కన్వర్ సింగ్ కట్టుకథలు అల్లుతున్నారని ఆరోపించారు.