ఆ ఎమ్మెల్యే వారసులతో బైరెడ్డి పోటీ..వైసీపీలో ఏం జరుగుతోంది?

-

వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయడానికి కొంతమంది సీనియర్ నేతల వారసులు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొందరి వారసులు నియోజకవర్గాల్లో రాజకీయంగా దూకుడుగా ఉంటున్నారు. ఇక సీనియర్లు సైతం రెస్ట్ తీసుకుని తమ వారసులని బరిలో దింపాలని చూస్తున్నారు. కానీ జగన్ అందరి వారసులకు అవకాశం ఇవ్వడం లేదు..కొందరికే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇక మిగతా సీనియర్లకు నెక్స్ట్ ఎన్నికల్లో తనతో పాటే పోటీ చేయాలని సూచిస్తున్నారు.

ఇదే క్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో కొంతమంది సీనియర్లు సైతం తమ వారసులని రంగంలోకి దింపాలని చూస్తున్నారు. ఇప్పటికే సీనియర్ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి పోటీకి దూరమని చెప్పేశారు. ఈ సారి తన వారసుడుని ఎమ్మిగనూరులో బరిలో దించడానికి సిద్ధమయ్యారు. చెన్నకేశవ బాగా పెద్దవారు కావడంతో జగన్..ఆయన వారసుడుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అటు శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి సైతం తన వారసుడుని రంగంలోకి దింపాలని చూస్తున్నట్లు తెలిసింది. ఒకవేళ శిల్పా తన వారసుడుకు సీటు ట్రై చేస్తే..తనకు శ్రీశైలంలో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి..జగన్‌ని కోరుతున్నట్లు తెలిసింది. ఈ అంశంపై శిల్పా గుర్రుగా ఉన్నారని కథనాలు వస్తున్నాయి.

అటు మరొక నియోజకవర్గంపై కూడా బైరెడ్డి ఫోకస్ పెట్టారని తెలిసింది..అక్కడ కూడా సీనియర్ ఎమ్మెల్యే తన వారసుడుకే సీటు ఇప్పించుకోవాలని చూస్తున్నట్లు తెలిసింది. ఇలా కర్నూలులో కొందరు సీనియర్లు తమ వారసులకు సీటు ఇప్పించుకోవాలని చూస్తుంటే..మధ్యలో బైరెడ్డి ఎంట్రీ ఇస్తున్నారట. మరి చివరికి జగన్..ఎవరికి అవకాశం ఇస్తారనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news