అమరావతి వరదలను తట్టుకోగలదా..? రాజధాని చుట్టూ జరుగుతున్న హాట్ టాపిక్ ఇదే..

-

ఆంధ్రుల రాజధాని అమరావతి అంటూ చంద్రబాబు రాజధాని నిర్మాణానికి నడుంబిగించారు.. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధాని లో బెటర్ అంటూ సీఎం జగన్ భావించారు.. అందులో భాగంగా విశాఖ తో పాటు కర్నూలును కూడా అభివృద్ధి చేయాలంటూ ఆయన ప్రణాళిక రచించారు.. విశాఖలో కోట్ల రూపాయలతో కట్టడాలు సైతం నిర్మించారు.. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే.. అమరావతి ఏపీ రాజధాని అని ప్రకటించిన చంద్రబాబు.. మిగిలిన కట్టడాలను త్వరితగతిన పూర్తి చేయాలంటూ.. అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. ఇంతవరకు బాగానే ఉన్నా అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది..

కృష్ణ గుంటూరు జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అమరావతి నీట మునిగింది.. గతంలో ఎన్నడూ లేనంతగా వరదలు రావడంతో విజయవాడ సగానికి సగం నీటిలో మునిగింది.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. ఇలాంటి సమయంలో.. రాజధానిగా అమరావతి ప్రాంతం నిజంగా సేఫ్ యేనా అనే చర్చ మొదలైంది.. ఏపీలో ఉండే విశాఖ నే సేపేస్ట్ సిటీగా ఉంటుందనే భావన ఇప్పుడు ప్రజల్లో వ్యక్తం అవుతుంది.. విశాఖలో ఎంత భారీ వర్షం కురిసినా .. గంటలోపే నీరంతా వెళ్లి సాగరంలో కలుస్తుంది.. అక్కడ అండర్ గ్రౌండ్ సిస్టం అంత పర్ఫెక్ట్ గా ఉందని చెప్పుకోవచ్చు.. కానీ అమరావతిలో అదేది లేకపోవడంతో జలదిగ్బంధంలో అమరావతి ఉంది..

గతంలో హుదూద్ తుఫాన్ సంభవించిన.. నీరన్నది ఎక్కడా కనిపించలేదు.. భారీ తుఫాను సైతం తట్టుకునే సమర్థత సామర్థ్యం విశాఖకి ఉందని నిపుణులు చెబుతున్నారు.. ఎటువైపు చూసినా విశాఖ భద్రమైన నగరంగా పేరు ఉంది.. ఏపీ రాజధానికా అమరావతి కంటే విశాఖపట్నం బెస్ట్ అనే వారి సంఖ్య ఈ మధ్యకాలంలో ఎక్కువైందని చెప్పుకోవచ్చు.. కానీ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం అమరావతిని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సహాయము అడుగుతున్నారు.. విశాఖపట్నంని అభివృద్ధి చేస్తే భవిష్యత్తులో మహానగరంగా మారే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.. ఈ బీభత్సమైన వరదలు చూసిన తర్వాత అయినా చంద్రబాబు ఆలోచనలో మార్పు ఉంటుందేమో చూడాలి మరి..

Read more RELATED
Recommended to you

Latest news