డేటా చోరీ…. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై కేసు నమోదు?

నెల్లూరు: మాజీ మంత్రి సోమిరెడ్డి‌పై కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. తమ అనుమతి లేకుండా డేటా చోరీ చేశారని, మోసపూరిత కుట్ర చేస్తున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి‌పై కృష్ణపట్నం పోర్టు పోలీస్ స్టేషన్‌లో శ్రేశిత టెక్నాలజీస్ సంస్థ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. పూర్తిగా డెవలప్ చేయని తమ సైట్‌ని సోమిరెడ్డి రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని శ్రేశిత టెక్నాలజీస్ ఎండీ నర్మద్ రెడ్డి పేర్కొన్నారు. తనపై చేసిన ఆరోపణలు వల్ల తమ కంపెనీకి చెడ్డపేరు వచ్చిందని, దీనిపై సోమిరెడ్డి‌పై చర్యలు తీసుకోవాలని శ్రేశిత టెక్నాలజీస్ ఎండీ నర్మదా రెడ్డి డిమాండ్ చేశారు.

‘‘మా సంస్థపై అసత్య ఆరోపణలు చేసిన దానిపై కేసు పెట్టడం జరిగింది. మేము అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు. అవగాహన లేకుండా సోమిరెడ్డి మా సంస్థపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. మా డేటాని మాకు తెలీయకుండా చోరీ చేశారు. మేము వైసీపీ అభిమానులమే, కానీ మా సంస్థపై ఇలాంటి ఆరోపణలు చేయడం దారుణం. మేము ప్రజలకు మంచి చేయడం కోసం వెబ్ సైట్ క్రియేట్ చేశాం.’’ అని నర్మదారెడ్డి తెలిపారు.

కాగా ఆనందయ్య మందు పేరుతో సోమ్ము చేసుకోవాలని ఎమ్మెల్యే కాకాణి ప్రయత్నిస్తున్నారని సోమిరెడ్డి శనివారం ప్రెస్ మీట్ పెట్టి అన్నారు . మే 21 నుండి ఆనందయ్య మందును క్యాష్ చేసుకోవాలన్న కుట్రలు ప్రారంభమయ్యాయన్నారు. శ్రేషిత టెక్నాలజీ వద్ద సైట్‌కొని ఇంటర్నెట్‌లో హోస్ట్ చేసి వెంటనే డిలీట్ చేసినట్లు తెలిపారు. శ్రేషిత కంపెనీలో డైరెక్టర్లు వైసీపీ నాయకులని ఆరోపించారు. సైట్‌లో రూ.15 పెట్టి ప్రజలకు అందుబాటులోకి వచ్చే వచ్చిన తర్వాత రూ.167 చేశారని పేర్కొన్నారు. కోటి మందికి ఆన్‌లైన్‌లో మందు అమ్మి రూ.120 కోట్లు సొమ్ము చేసుకునేందుకు కాకాణి గోవర్దన్ కుటిల ప్రయత్నం చేశారని వ్యాఖ్యానించారు.

ఇక సోమిరెడ్డి వ్యాఖ్యలపై ఆదివారం సీరియస్ అయింది. ఆయనపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమిరెడ్డిపై ఫిర్యాదు చేశారు. మరి సోమిరెడ్డి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.